సెక్సిస్టు రిమార్కులు: మంత్రి ఫరూక్ అబ్దుల్లా సారీ

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎకె గంగూలీ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ ఈ రోజుల్లో ఆడవాళ్లతో మాట్లాడాలంటే తనకు భయం వేస్తోందని, మహిళా కార్యదర్శిని పెట్టుకోవడానికి కూడా తాను ఇష్టపడనని ఆయన అన్నారు. మీరు మహిళలను నిందిస్తున్నారా అని అడిగితే కాదని, తాను సమాజాన్ని నిందిస్తున్నానని ఆయన జవాబిచ్చారు.
అది ప్రస్తుత పరిస్థితి అని, అత్యాచార సంఘటనలు పెరిగాయనే విషయాన్ని తాను అంగీకరిస్తున్నానని, వాటికి ఏదో ఒక చోట అంతం పలకాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అబ్డుల్లాపై మిత్రపక్షం కాంగ్రెసు నుంచే కాకుండా ప్రతిపక్షాల నుంచి కూడా తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి.
ఫరూక్ అబ్జుల్లా నుంచి తాను అటువంటి వ్యాఖ్యలను ఊహించలేదని కాంగ్రెసు నేత అంబికా సోనీ అన్నారు. అంత సీనియర్ నేత ఆడవాళ్లను కించపరిచే దారుణమైన వ్యాఖ్య చేయడం దారుణమని బిజెపి నేత స్మృతి ఇరానీ అన్నారు.












Click it and Unblock the Notifications