అమీర్‌కు మద్దతు: పీఓకే పాక్‌కేనన్న ఫరూక్ అబ్దుల్లా

శ్రీనగర్: దేశంలో అసహనం పెరిగిపోయిందంటూ వ్యాఖ్యలు చేసి పలు వర్గాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్‌కు జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా మద్దతుగా నిలిచారు. దేశం విడిచి వెళ్తానని అమీర్ చెప్పలేదని, అతని వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు.

‘ఆయన దేశం విడిచి వెళ్లిపోతానని ఎప్పుడు అన్నారు? నేను కూడా అక్కడి వున్నా. ఇదంతా అతనికి వ్యతిరేకంగా జరుగుతున్న తప్పుడు ప్రచారమే. దేశం విడిచి వెళ్తానని అతను అసలే అనలేదు. భారత్ తన దేశమని, పుట్టి పెరిగింది ఇక్కడేనని, ఇక్కడే ఉంటానని అమీర్ అన్నారు' అని అబ్దుల్లా శుక్రవారం చెప్పారు.

అమీర్ దేశం విడిచి వెళ్లేందుకు కారణమే లేదని ఫరూక్ అన్నారు. మీడియానే అతని వ్యాఖ్యలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేసిందని ఆరోపించారు.

కాగా, కాంగ్రెస్ నేత, జమ్మూకాశ్మీర్ ఆర్థిక మంత్రి గిరిధారి లాల్ డోగ్రా వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఫరూక్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సిఎం నిర్మల్ సింగ్, మంత్రి సిపి గంగా, ప్రియా సేథీ, బిజిపి నేత, జమ్మూకాశ్మీర్ స్పీకర్ కవీందర్ గుప్తా పాల్గొని నివాళులర్పించారు.

Farooq Abdullah defends Aamir Khan, says his statement was distorted

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ ఆ దేశానిదే

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ ఆ దేశానికే చెందుతుందని ఫరూక్ అబ్దుల్లా అన్నారు. భారత్‌లోని జమ్మూకాశ్మీర్ భూభాగం ఈ దేశంలోనే ఉంటుందని, ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు.

'కాశ్మీర్ సమస్యకు యుద్ధం పరిష్కారం కాదు. ప్రాణాలు మాత్రమే కోల్పోతాం. చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలి' అని ఫరూక్ అబ్దుల్లా శుక్రవారం అన్నారు. ఫరూక్ వ్యాఖ్యలపై బిజెపి నేతలు తీవ్రంగా మండిపడ్డారు.

'ఇదో అబద్ధపు ప్రకటన. పాకిస్థాన్ ఆధీనంలోని కాశ్మీర్, ఆ దేశం అక్రమంగా స్వాధీనం చేసుకున్నది' అని కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి, బిజెపి ఎంపీ ఆర్కే సింగ్ అన్నారు. కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ స్పందిస్తూ.. కాశ్మీర్ సమస్యపై 1994లో పార్లమెంట్‌లో ఏకగ్రీవ తీర్మానం చేసిన విషయాన్ని మరచిపోరాదని చెప్పారు. ఈ విషయంపై ప్రభుత్వ వైఖరి స్పష్టంగా ఉందని, దీనిపై బిన్న వైఖరి లేదని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+