దేశ ప్రజలకు క్షమాపణ చెప్పండి.. లేదా పాకిస్థాన్ వెళ్లిపోండి: ఫరూఖ్ అబ్దుల్లాపై బీజేపీ ఫైర్

భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకున్న సంగతి తెలిసిందే. గతేడాది ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా పరిస్థితులు తయారయ్యాయి. ఈ క్రమంలో జమ్మూ కాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌(NC) పార్టీ అధ్యక్షుడు ఫరూఖ్‌ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. జమ్మూ కాశ్మీర్ ప్రజలను పాకిస్థాన్ రక్షిస్తోందంటూ ఆయన చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ఫరూక్ అబ్దుల్లా​ వ్యాఖ్యలు భారతదేశానికి వ్యతిరేకంగా ఉన్నాయని.. ఇవి దేశద్రోహ పూరితమైన వ్యాఖ్యలని ఆగ్రహం వ్యక్తం చేసింది.

మరోవైపు ఇదే అంశంపై జమ్మూ కాశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు, రాజ్య సభ ఎంపీ సత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫరూక్ అబ్దుల్లా దేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని అన్నారు. లేదా పాకిస్థాన్ కు వెళ్లి అక్కడే నివసించాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వ హయాంలో.. ఎవరైనా కాశ్మీర్ వైపు కన్నెత్తి చూస్తే తగిన గుణపాఠం చెబుతున్నామన్నారు. భవిష్యత్తులోనూ ఇది కొనసాగుతుందని సత్‌ శర్మ స్పష్టం చేశారు. అలాగే ఫరూఖ్‌ ఇదే తరహా వ్యాఖ్యలు పాకిస్థాన్‌ లో ఉండి చేయగలరా..? అని ప్రశ్నించారు. ఇక మరికొంత మంది బీజేపీ నాయకులు, కొన్న సంస్థలు.. ఫరూక్ అబ్దుల్లాను అరెస్ట్ చేయాలని పట్టుబడుతున్నారు.

FarooqAbdullah Apologize to the people of the country else leave for Pakistan BJP Sat Sharma slams

ఇక ఉత్తర కాశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 'మీరు(కాశ్మీర్ ప్రజలు)కాశ్మీర్ ను కాపాడుకోకపోతే.. మీరు పూర్తిగా అంతం అవుతారు. మన జాడలు.. గుర్తింపు కూడా కనుమరుగవుతాయి. ఏదీ కూడా మిగలదు. ప్రపంచమంతటా గందరగోళం నెలకొని ఉంది కాబట్టి వారు ఇవాళ మౌనంగా ఉన్నారు. అయితే ఈ కశ్మీర్ సమస్య సజీవంగా ఉండడం వెనుక మన పొరుగుదేశం పాకిస్థాన్ కారణం. ప్రతిచోటా కశ్మీర్​ విషయాన్ని వాళ్లు లేవనెత్తుతున్నారు. అదే మిమ్మల్ని కాపాడుతోంది.. అని ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+