'ఫ్యాషన్' షాక్: యువతికి బలవంతంగా బీరు తాగించి..
ఢిల్లీ: డిగ్రీ పూర్తయిన తర్వాత కోటి ఆశలతో ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో భవిష్యత్తు తీర్చిదిద్దుకోవాలనుకున్న ఓ యువతికి ఓ కంపెనీలో ఉద్యోగం దొరికింది. కానీ ఉద్యోగంలో చేరిన మొదటి రోజునే బాస్ నుంచి ఆమెకు లైంగిక వేధింపులు వచ్చాయి. బాస్ ఏకంగా ఆమె పైన అత్యాచారానికి ఒడిగట్టాడు.
దక్షిణ ఢిల్లీకి చెందిన ఓ యువతికి ఈ చేదు అనుభవం ఎదురైంది. గురుగ్రాంకు చెందిన ఓ రిటైల్ కంపెనీ అమెను ఉద్యోగంలోకి తీసుకుంది. సోమవారం నాడు ఆమె ఉద్యోగంలో చేరింది. ఈ సందర్భంగా తనకు ఎదురైన అనుభవాన్ని ఆమె చెప్పింది.
'నేను ఉదయం పదకొండు గంటలకు కార్యాలయానికి వెళ్లాను. కంపెనీ ఎండీ తనతో కాసేపు మాట్లాడాడు. కొద్దిసేపు అక్కడే ఉండమని చెప్పాడు. ఆ తర్వాత మూడు గంటల తర్వాత వచ్చి మరోచోట ఉన్న కంపెనీ యూనిట్‌ను సందర్శించేందుకు నాతో వస్తావా అని అడిగాడు.

మొదట సంకోచించాను. సహోద్యోగులు ప్రోత్సహించడంతో బాస్‌తో కలిసి కారులో వెళ్లాను కారులో ఎక్కినప్పటి నుంచి అతను నన్ను అసభ్యమైన ప్రశ్నలతో వేధించాడు. మందు తాగుతావా, ఎలాంటి దుస్తులు వేసుకుంటావు.. తదితర ప్రశ్నలను అడిగాడు.
తాము అక్కడకు చేరుకున్నాము. అక్కడున్న మిగతా వారి నుంచి అతని గురించి ఆరా తీశాను. మిగతా వారికి కూడా ఇలాంటి అనుభవం ఎదురైందా అని ఆరాతీసాను. ఆ తర్వాత కంపెనీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించాను. ఆ తర్వాత అదే కారులో తిరిగి వచ్చాము.
అయితే, తిరిగి వచ్చే సమయంలో మరీ దారుణంగా ప్రవర్తించాడు. మద్యం తాగుతూ, పార్టీలకు హాజరైతే నువ్వు ఎక్కడకో వెళ్లిపోతావని, ఎంతగానో ఎదుగుతావని చెప్పాడు. ఓ చోట కారు ఆపి బీరు కొనుక్కొచ్చి నాతో బలవంతంగా తాగించాడు. నన్ను తాకాడు.
ఆ సమయంలో నేను మరో నిర్భయను అవుతానని భయపడ్డాను. సమీపంలోని మెట్రో వద్ద దింపేయమని అతనికి విజ్ఞప్తి చేశాను. తీవ్రంగా ప్రతిఘటించడంతో తనను సాయంత్రం ఆరు గంటలకు దించేశాడ'ని ఆమె చెప్పింది. కాగా, ఆ తర్వాత అతని పైన పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications