ముస్సోరీలో ఘోర ప్రమాదం.. విహారానికి వెళ్లిన ఆరుగురు విద్యార్థులు మృతి
శనివారం ఉదయం ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీ-డెహ్రాడూన్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయం 5 గంటల ప్రాంతంలో కారు అదుపు తప్పి ఓ గుంతలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు మృతి చెందారు. ప్రమాద సమయంలో కారులో మొత్తం ఆరుగురు ఉన్నారని, వీరంతా ఒకే కాలేజీకి చెందిన విద్యార్ధులని గుర్తించారు.
ఈ ప్రమాదంపై సిటీ కొత్వాల్ అరవింద్ చౌదరి తెలిపిన వివరాల ప్రకారం.. ఝరిపానీ రోడ్డులోని పానివాలే బ్యాండ్ దగ్గర ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిన ముస్సోరీ పోలీస్ ఫైర్ సర్వీస్, SDRF బృందం సంఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు ప్రారంభించారు. ఘటనా స్థలంలోనే ముగ్గురు మృతి చెందగా, గాయపడిన మరో ముగ్గురిని కాలువలో నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా వారు కూడా చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రమాద సమయంలో నలుగురు యువకులు, ఇద్దరు మహిళలు సహా మొత్తం ఆరుగురు ప్రయాణిస్తున్నారు. ప్రమాదంలో మరణించిన ఆరుగురిలో ఐదుగురు యువకులు, ఒక యువతి ఉన్నారు.

ఒకే కళాశాల విద్యార్థులు..
ఇప్పటికే, మృతదేహాలను కాలువలో నుంచి బయటకు తీసి ముస్సోరి సబ్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద బాధితులను గుర్తించేందుకు ముస్సోరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు, మృతులందరూ డెహ్రాడూన్ IMS కళాశాల విద్యార్థులుగా తెలుస్తోంది. ముస్సోరీ విహారానికి ఉదయం ముస్సోరీ నుంచి డెహ్రాడూన్‌కు వెళ్తుండగా కారు అదుపు తప్పి లోతైన గుంతలో పడిందనట్లు గుర్తించారు. ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications