యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం..స్పాట్‌లో ఐదుగురు మృతి..
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అజాంఘర్ సమీపంలోని టప్పాల్ వద్ద డబుల్ డెక్కర్ బస్సు, ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం సంబవించింది. నిన్న (బుధవారం, నవంబర్ 20) అర్థరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో స్పాట్‌లో ఐదుగురు ప్రయాణికులు మృతిచెందగా, మరో 15 మంది ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు.
ఢిల్లీ నుంచి అజాంఘడ్ వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు ప్రమాదానికి గురైంది. తప్పల్ సమీపంలో ఎదురుగా వస్తున్న ఖాళీ బీర్ల సీసాల ట్రక్కును ఈ బస్సు ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనలో ఐదుగురు అక్కడిక్కడే చనిపోయారు. మృతిచెందినవారిలో ఓ పసికందు, మహిళ, ముగ్గురు పురుషులు ఉన్నట్లు సమాచారం. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

తుక్కుతుక్కయిన బస్సు..
ఈ ప్రమాద ధాటికి బస్సు ముందు భాగమంతా తుక్కుతుక్కయ్యింది. బస్సులో చిక్కుకుపోయిన ప్రయాణికుల్ని అతికష్టం మీద బయటకు తీశారు. గాయపడిన వారిని జెవార్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సమాచారం అందుకున్న టప్పాల్ పోలీసులు హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఐదుగురు మృత దేహాలను పోస్టు మార్టమ్ నిమిత్తం తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications