Zika Virus: మహారాష్ట్రలో తండ్రీకూతుళ్లకు సోకిన జికా వైరస్..

మహారాష్ట్రలోని పూణేలో ఈ ఏడాది తొలిసారిగా జికా వైరస్‌ సోకిన రెండు కేసులు నమోదయ్యాయని ఓ అధికారి తెలిపారు. 46 ఏళ్ల డాక్టర్, అతని కుమార్తె జికా వైరస్‌కు పాజిటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు. "పుణె నగరంలోని ఎరంద్‌వానే ప్రాంతంలో నివసిస్తున్న 46 ఏళ్ల డాక్టర్, అతని కూతురు జికా వైరస్‌కు పాజిటివ్‌గా తేలింది. ఇద్దరూ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు" అని పూణే మున్సిపల్ కార్పొరేషన్‌లోని అసిస్టెంట్ హెల్త్ ఆఫీసర్ రాజేష్ డిఘే చెప్పినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపింది.

రోగులలో లక్షణాలు కనిపించిన తర్వాత డాక్టర్ నుంచి నమూనాను మొదట ఎన్ఐవీ పూణేకు పంపినట్లు డిఘే చెప్పారు. ఆ తరువాత వైద్యుడి కుటుంబం సభ్యుల నమూనాలను పరీక్ష కోసం పంపారు. పరీక్షల్లో కుమార్తెకు కూడా వైరస్‌కు సోకినట్లు తేలింది. మిగతా కుటుంబ సభ్యులు నెగిటివ్ వచ్చినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఇతర అనుమానిత కేసులు ఏవీ కనుగొనబడనప్పటికీ, అధికారులు దోమల వృద్ధిని అరికట్టడానికి ఫాగింగ్, ఫ్యూమిగేషన్ వంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ప్రారంభించారని పూణే మునిసిపల్ కార్పొరేషన్ (PMC) ఆరోగ్య అధికారి పీటీఐకి చెప్పారు.

Father and daughter infected with Zika virus in Pune Maharashtra

ఈ కేసులను గుర్తించిన తరువాత, పుణె మున్సిపల్ కార్పొరేషన్ (PMC) ఆ ప్రాంతాన్ని సందర్శించి క్షుణ్ణంగా తనిఖీ చేసింది. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని వారిని కోరింది. జికా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి పౌరులు మార్గదర్శకాలను అనుసరించాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని PMC కోరుతోంది. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, నగరంలో వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని వారు హామీ ఇచ్చారని ANI నివేదించింది.

"మేము ఈ ప్రాంతంలో సాధారణ ప్రజలకు అవగాహన కల్పించాము. ఈ ప్రాంతంలోని గర్భిణీ స్త్రీల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి సూచనలు ఇచ్చాము. జికా సాధారణంగా తీవ్రమైన సమస్యలకు దారితీయదు. కానీ గర్భిణీ స్త్రీకి వ్యాధి సోకితే అది పిండంలో మైక్రోసెఫాలీకి కారణం కావచ్చు" అని వైద్యులు తెలిపారు.సోకిన ఈడిస్ ఈజిప్టి దోమ కాటు ద్వారా జికా వైరస్ వ్యాపిస్తుందని, ఇది డెంగ్యూ, చికున్‌గున్యా వంటి వ్యాధులను కూడా వ్యాపిస్తుందని డాక్టర్ రాజేష్ డిఘే వివరించారు. 1947లో ఉగాండాలో తొలిసారిగా ఈ జికా వైరస్‌ను గుర్తించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+