లిఫ్టులో ఇరుక్కున్న కుమారుడు.. షాక్ లో తండ్రికి ఏమైందంటే ?
ఓ వైపు కన్న కొడుకుకు ఏం జరుగుతుందో అనే భయం.. మరోవైపు ఎలా కాపాడుకోవాలనే తాపత్రయం.. ఈ భిన్న పరిస్థితుల్లోనే ఓ తండ్రి గుండె ఆగిపోయింది. ఈ అనూహ్య ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరంలో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్షణాల్లోనే ఆనందంగా గడుపుతున్న ఓ కుటుంబం తీరని విషాదం లోకి క్రుంగిపోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
భోపాల్ లోని జత్కేడీ ప్రాంతంలోని అపార్ట్‌మెంట్‌లో రిషిరాజ్ భట్నాగర్ (51) తన భార్య నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. సోమవారం రాత్రి తమ కుమారుడు కనిపించకపోవడంతో వెతుక్కుంటూ కిందకి వచ్చారు. ఆ తర్వాత వెతకగా బాలుడు కనిపించడంతో ఇంటికి వెళ్లమని చెప్పాడు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు మాటలు విని ఆ పిల్లాడు ఎలివేటర్ ఎక్కాడు. కానీ అప్పుడే పవర్ కట్ అవ్వడంతో బాలుడు లిఫ్ట్ లోనే ఇరుక్కుపోయాడు.

అయితే విషయం తెలుసుకున్న రిషిరాజ్.. అప్పుడే ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలాడు. పడిపోయిన రిషిరాజ్‌ను చూసి, అపార్ట్‌మెంట్ వాసులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే అతడు మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని పోలీసులు వెల్లడించారు. పోస్టుమార్టం నివేదిక తర్వాత పూర్తి విషయాలు వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు.
మరోవైపు లిఫ్ట్ లో ఇరుక్కున్న బాలుడు.. కొంచెం సేపతి తర్వాత కరెంట్ రావడంతో క్షేమంగా బయటకు వచ్చాడని చెబుతున్నారు. కానీ తన రిషిరాజ్ మరణంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.












Click it and Unblock the Notifications