దారుణం: కన్న కూతురినే రేప్ చేసిన తండ్రి..
ఇంట్లో భార్య లేని సమయంలో.. అదే అదునుగా భావించి 11ఏళ్ల కూతురిపై ఓ కీచక తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఘజియాబాద్: కన్న కూతురన్న కనీస మానవత్వం లేకుండా.. కడుపున పుట్టిన బిడ్డపైనే ఓ తండ్రి అత్యాచారానికి తెగబడ్డాడు. ఇంట్లో భార్య లేని సమయంలో.. అదే అదునుగా భావించి 11ఏళ్ల కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ పరిధిలో ఉన్న ఖోడో ప్రాంతంలో ఈ దారుణం చోటు చేసుకుంది. చాన్నాళ్లుగా కూతురిని లైంగికంగా వేధిస్తు వస్తున్న సదరు తండ్రి.. ఇంట్లో భార్య, పెద్ద కూతురు లేని సమయంలో.. చిన్న కూతురిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. మంగళవారం రాత్రి ఈ దారుణం జరిగింది. ఆ సమయంలో భార్య తమ బంధువుల విహహానికి వెళ్లినట్టుగా తెలుస్తోంది.
విషయం పోలీసుల దృష్టికి రావడంతో..బాలికను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించి నిందితుడిని అరెస్టు చేశారు. ఐపీసీ సెక్షన్ తో పాటు పోస్కో చట్టం కింద అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications