ఛీ: కన్న కుమార్తె పై తండ్రి లైంగిక వేధింపులు, డాక్టర్ కాదు కామాంధుడు, 7 ఏళ్లు!

బెంగళూరు: కన్న కుమార్తె మీద కన్నేసిన కామాంధుడు కొన్ని సంవత్సరాల నుంచి ఆమెను లైంగిక వేధింపులకు గురి చేసిన దారుణ ఘటన కర్ణాటకలోని మైసూరు నగరంలో జరిగింది. కన్న కూతురుని లైంగిక వేధింపులకు గురి చేసి అడ్డు వచ్చిన భార్యను చితకబాదేశాడు.

మైసూరు నగరంలోని ఉదయగిరిలో డాక్టర్ ఇమ్తియాజ్ అహమ్మద్ ఖాన్ నివాసం ఉంటున్నాడు. డాక్టర్ ఇమ్తియాజ్ అహమ్మద్ ఖాన్ కు భార్య తబసమ్, కుమార్తె ఉన్నారు. డాక్టర్ ఇమ్తియాజ్ అహమ్మద్ ఖాన్ మండ్య జిల్లా ఇఎస్ఐ ప్రభుత్వ ఆసుపత్రిలో సీనియర్ డాక్టర్ గా ఉద్యోగం చేస్తున్నాడు.

Fatherr sexual harassing his daughter in Mysusu

డాక్టర్ ఇమ్తియాజ్ అహమ్మద్ ఖాన్ కన్న కుమార్తె మీద కన్ను వేశాడు. గత 7 సంవత్సరాల నుంచి ఇమ్తియాజ్ అహమ్మద్ ఖాన్ కన్న కుమార్తెను లైంగికంగా వేధింపులకు గురి చేశాడు. విషయం బయటకు తెలిస్తే కుటుంబం పరువుపోతుందని కుమార్తె భయపడి ఇంత కాలం ఓర్చుకుంది.

తండ్రి లైంగిక వేధింపులు ఎక్కువ కావడంతో ఇక సహించలేని కుమార్తె తల్లి తబసమ్ కు విషయం చెప్పింది. ఇమ్తియాజ్ అహమ్మద్ ఖాన్ కుమార్తె మీద లైంగిక దాడి చేస్తున్న సమయంలో అతని భార్య తబసమ్ అడ్డుకునింది.

సహనం కోల్పోయిన ఇమ్తియాజ్ అహమ్మద్ ఖాన్ అడ్డు వచ్చిన భార్యను చితకబాది కుమార్తె మీద పడ్డాడు. ఇంటి నుంచి పారిపోయిన తబసమ్, ఆమె కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయగిరి పోలీసులు కేసు నమోదు చేసి కామాంధుడు ఇమ్తియాజ్ అహమ్మద్ ఖాన్ ను అరెస్టు చేశారు. తబసమ్ కేఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నదని, యువతికి వైద్యపరీక్షలు చేయించి కేసు విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+