ఫాదర్స్ డే స్పెషల్: నాన్నకు ప్రేమతో - ద హీరో (వీడియో)
ముంబై: జూన్ 19 (ఆదివారం) ఫాదర్స్ డే. ఈ సందర్భంగా చక్కని భావోద్వేగాలతో కూడిన ఓ షార్ట్ ఫిల్మ్‌ను గూగుల్ ఇండియా 'ద హీరో' పేరుతో విడుదల చేసింది. ఈ వీడియో ఇప్పుడు నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. ప్రముఖ వీడియో షేరింగ్ వెబ్‌సైట్ యూట్యూబ్‌లో ఈ వీడియోని పోస్ట్ చేసిన రెండు రోజుల్లోనే మూడు లక్షల మందికి పైగా వీక్షించారు.
ఈ వీడియోలో తన తండ్రి ఆశలకు జీవం పోశాడు. 'కొన్నేళ్ల క్రితం మీ తాతయ్య ఒప్పుకుని ఉంటే.. నాన్న షోలే సినిమాకి హీరో అయి ఉండేవాడు. దానితోపాటే బాలీవుడ్‌లో పెద్ద కథానాయకుడిగా ఎదిగి ఉండేవాడు. అయితే అప్పుడు తాతయ్య కాదనడంతో నాన్న అంత పెద్ద అవకాశాన్ని కోల్పోవలసి వచ్చింది. చివరికి ఓ సినిమా థియేటర్‌లో పనిచేస్తూ రిటైరవ్వాల్సి వచ్చింది. నాన్న జీవితంలో ఇదో పెద్ద వెలితిగా మిగిలిపోయింది.'

ఈ కథను అమ్మ ద్వారా తెలుసుకున్న ఆ కొడుకు నాన్నని సంతోష పెట్టేందుకు ఏదైనా చెయ్యాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా గూగుల్ సాయంతో తండ్రిని షోలే సినిమా చిత్రీకరించిన షూటింగ్ స్పాట్‌కు తీసుకెళ్లాడు. ఆయనతో ఆ సినిమాకి సంబంధించిన డైలాగులు చెప్పించాడు.

అలా తన తండ్రి డైలాగులు చెబుతుంటే వాటన్నింటిని వీడియోలు చేశాడు. ఆ వీడియోలతో ఆ కొడుకు ఏం చేశాడు? వాటితో తండ్రి కలను ఎలా నెరవేర్చాడు? లాంటి విషయాలను తెలుసుకోవాలంటే వీడియో పూర్తిగా చూడాల్సిందే. ఆ వీడియో మీ కోసం...












Click it and Unblock the Notifications