మోడీ తల్లిని కిడ్నాప్ చేస్తే, ఏదంటే అది: ఫేస్‌బుక్ వ్యాఖ్య
లక్నో: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లిని కిడ్నాప్ చేస్తే.. అంటూ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు ఫేస్‌బుక్‌లో కామెంట్ పెట్టాడు. దీంతో ఇంటెలిజెన్స్ బ్యూరో అలర్ట్ అయ్యింది. దీంతో అతను తన ఫేస్‌బుక్ కామెంట్‌ను తొలగించాడు. మోడీ తల్లిని కిడ్నాప్ చేస్తే.. మనం ఏం అడిగితే అది చేస్తాడంటూ యూపికి చెందిన ఇంజమామ్ ఖాద్రీ అనే యువకుడు ఫేస్‌బుక్‌లో కామెంట్ పెట్టాడు.
దీంతో కేంద్ర ఇంటిలిజెన్స్ బ్యూరో వర్గాలు గుజరాత్‌లోని తమ అధికారులను అప్రమత్తం చేశాయి. ఈ మేరకు మోడీ కుటుంబసభ్యుల భద్రతా ఏర్పాట్లపై మరోసారి దృష్టి సారించినట్లు ఆ రాష్ట్రంలోని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు.

అలాగే గాంధీనగర్‌లో మోడీ సోదరుని ఇంట్లో ఉంటున్న హీరాబా రక్షణ నిమిత్తం చేసిన భద్రతా ఏర్పాట్లను మరోసారి సమీక్షించారు. ఇంజమామ్ ఖాద్రీ కామెంట్‌ను పరిశీలిస్తున్నామని, దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అటు ఉత్తర ప్రదేశ్ పోలీసులు కూడా దీనిపై ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు తన వ్యాఖ్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు వెల్లువెత్తడం, ఇంటెలిజెన్స్ బ్యూరో వర్గాలు అప్రమత్తమవడంతో ఖాద్రీ దాన్ని తొలగించాడు.












Click it and Unblock the Notifications