Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

February మళ్లీ 823 ఏళ్లకే.. ఈ కథ ఎక్కడి నుంచి వచ్చింది?

సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఓ ఫిబ్రవరి "అద్భుత నెల"గా మారిపోయింది. "ఇది అరుదైన ఫిబ్రవరి... మళ్లీ ఇలాంటిది రావాలంటే 823 ఏళ్లు వేచి చూడాలి" అంటూ వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో సందేశాలు చక్కర్లు కొడుతున్నాయి. నాలుగు ఆదివారాలు... నాలుగు సోమవారాలు... ఇలా వారంలోని ప్రతి రోజూ నాలుగుసార్లు రావడం గొప్ప మిరాకిల్ అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ వార్త చదివితే మాత్రం చదివితే నిజంగానే ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

అయితే ఫిబ్రవరి నెలలో వారంలోని అన్ని రోజులు నాలుగు సార్లు రావడం అనేది ఏ కొత్త విషయం కాదు. ఇది ప్రతి నాన్-లీప్ ఇయర్‌లో సాధారణంగా జరిగే విషయమే. నాలుగు సంవత్సరాల చక్రంలో మూడు సార్లు ఫిబ్రవరి నెలలో ఇదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీనిని అరుదైన సంఘటనగా చెప్పడం సరైనది కాదు.

February 2026 Viral Claim Fact Check Is This Really a Rare Month Occurring Once in 823 Years

ఈ ప్రచారంలో కొంతమందికి కొత్తగా అనిపించిన అంశం ఫిబ్రవరి నెల ఆదివారంతో ప్రారంభమవుతుందనేదే. కానీ ఇది కూడా పెద్ద విశేషమేమీ కాదు. సుమారు ప్రతి 11 ఏళ్లకోసారి ఫిబ్రవరి నెల ఆదివారంతోనే మొదలవుతుంది. గతంలో 2015లో ఇదే జరిగింది, ఇక మళ్లీ 2037లో కూడా ఇదే పరిస్థితి కనిపించనుంది. అంటే ఇది తరచూ పునరావృతమయ్యే సహజ ప్రక్రియ మాత్రమే.

823 సంవత్సరాలకోసారి ఇలాంటి ఫిబ్రవరి వస్తుందన్న వాదనకు ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదు. క్యాలెండర్ లెక్కలు గానీ, ఖగోళ గణితం గానీ ఈ మాటను సమర్థించవు. వాస్తవానికి 2022 నుంచే ఇలాంటి సందేశాలు ప్రతి సంవత్సరం కొత్త ఏడాది పేరుతో మారుస్తూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

మొత్తంగా చూస్తే, 2026 ఫిబ్రవరి నెలలో ఎలాంటి అద్భుతం లేదు, మిరాకిల్ కూడా లేదు. ఇది సాధారణ నాన్-లీప్ ఇయర్ ఫిబ్రవరి మాత్రమే. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రతీ విషయం నిజమే అన్న భావనకు లోనవకుండా, ఇలాంటి సమాచారాన్ని షేర్ చేసే ముందు ఒకసారి నిజానిజాలను తెలుసుకోవడం అవసరం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+