ఏడుపొచ్చినంత పనిఅవుతోంది: దేశభక్తిపై షారుక్‌ఖాన్

ముంబై: ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న తన తాజా చిత్రం ఫ్యాన్‌లో నటనకు గాను అవార్డు రాకుంటే తాను ఏడుస్తానని బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ అన్నాడు. ఫ్యాన్ చిత్రంలో తాను పరిణితి చెందిన నటనను ప్రదర్శించానని చెప్పాడు.

ఈ దఫా తనకు అవార్డు రాకుంటే, అవార్డును దొంగిలిస్తానని సరదాగా అన్నాడు. అంతకుముందు ఆప్ కీ అదాలత్ అనే టీవీ కార్యక్రమంలో షారుక్ మాట్లాడాడు. ఆయన దేశభక్తి అంశం పైన కూడా మాట్లాడాడు. తన దేశభక్తిని రుజుకోవాల్సిన పరిస్థితి తలెత్తే సందర్భాల్లో తనకు చాలా బాధ వేస్తుందనీ, ఏడ్పొచ్చిన్నంత పనవుతుందన్నాడు.

Feel like crying that I should be made to say I am a patriot: Shah Rukh Khan

తనకన్నా గొప్ప దేశభక్తుడు ఉండరన్నాడు. నేనీ దేశానికి చెందినవాడినేనని, నేనో దేశభక్తుడినని చెప్పుకోవాల్సి రావడం కొన్నిసార్లు బాధను కలిగిస్తుందన్నాడు. మనం దేశభక్తులమని చెప్పుకోవడానికి ఇతరులతో పోటీ పడక్కర్లేదన్నాడు. తనకు ఏడుపు వచ్చినంత పని అవుతుందన్నాడు.

తానెంత మంచి దేశభక్తుడో ప్రతిసారీ వివరించాల్సి రావడం విచారకరమన్నారు. సహనంతో ఉండాలనీ, దేశాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా కృషిచేయాలని యువతకు సందేశమిచ్చారు. తనకు ప్రతిచోటా స్నేహితులున్నారనీ, తనకు రాజకీయాలతో సంబంధం లేదని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+