10th విద్యార్థితో టీచర్ ఎఫైర్ .. చివరకు కటకటాలపాలైన పంతులమ్మ..
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు పెడదారిన పడుతున్నారు. విద్యార్థినిలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉప్యాధాయ వృత్తికే కలంకం తేస్తున్నారు. ఇప్పటి వరకు బాలికలపై ఉపాధ్యాయులు వేధింపులు, ఆత్యాచారాలు చేసిన సంఘటనలు చూశాం. కానీ ఈసారి సీన్ రీవర్స్ అయింది. తమిళనాడులో ఓ పంతులమ్మ తన స్టూడెంట్‌ను ప్రేమిస్తున్నానంటూ వేధిస్తోంది. ప్రేమించాలంటూ వెంటపడింది.

విద్యార్థితో టీచరమ్మ ప్రేమాయణం
ఈ ఘటన తమిళనాడులోని అరియలూర్‌లో చోటు చేసుకుంది. ఓ స్కూల్లో పాఠాలు చెప్పే టీచరమ్మ అదే స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న బాలుడితో ప్రేమలో పడింది. బాలుడికి పుస్తకాలలో సిలబస్ పాఠాలు కాకుండా ప్రేమ పాఠాలు చెప్పింది. విద్యాబుద్ధులకు బదులు ఆ విద్యార్థితో ప్రేమకలాపాలు సాగిస్తోంది. టీచరమ్మ పాడుబుద్ధి ఆనోటా ఈనోటా పాకింది. చివరికి ఈ ప్రేమాయణం విద్యార్థి తల్లిదండ్రుల వరకు వెళ్లింది.

పంతులమ్మ పాడు బుద్థి
సదరు విద్యార్థిపై మనసు పారేసుకున్న ఉపాధ్యాయురాలి విషయం బాలుడి తల్లిదండ్రులకు తెలిసి షాక్ తిన్నారు. తన కుమారుడి భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన , విద్యాబుద్ధులు నేర్పించాల్సినే గురువే వక్రమార్గంలో నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తమ కుమారిడి భవిషత్తు ఏమైతుందో అని కంగారు పడ్డారు. పంతులమ్మ వ్యవహారంపై అరియాలూర్ పోలీసులకు విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

టీచరమ్మ అరెస్ట్..
టీచరమ్మ వ్యవహారంపై కేసులు నమోదు చేసిన పోలీసులు కూపీ లాగి అసలు విషయాన్ని రాబట్టారు. పంతులమ్మదే తప్పని తేల్చేశారు. ఫోక్సో చట్టం కింద కేసు పెట్టారు. పంతులమ్మను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.












Click it and Unblock the Notifications