బంగాళాఖాతంలో ఫెంగల్ తుఫాన్ ఎక్కడివరకు వచ్చిందంటే..?!

Fengal Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావం మూడు రాష్ట్రాల్లో అధికంగా కనిపిస్తోంది. తమిళనాడు, ఏపీ, కర్ణాటకతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిపై పడింది. ప్రత్యేకించి- తమిళనాడు, పుదుచ్చేరిలపై పంజా విసురుతోంది. అతి భారీ వర్షాలకు కారణమౌతోంది.

తమిళనాడు, పుదుచ్చేరిల్లో రెండు రోజులుగా అతి భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. చెన్నై సహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ అధిక వర్షపాతం నమోదవుతోంది. అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఈ వర్షాల వల్ల తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వాలు పాఠశాలలకు సెలవును సైతం ప్రకటించిన విషయం తెలిసిందే.

Fengal Cyclone Extreme rain predicted for Tamil Nadu Puducherry and Andhra Pradesh

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. తీవ్ర వాయుగుండంగా మారింది. ప్రస్తుతానికి తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతోంది. ఈ సాయంత్రానికి తుఫాన్‌గా మారడానికి అనుకూల వాతావరణం ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీనికి ఇదివరకే ఫెంగల్ అని పేరు పెట్టిన విషయం తెలిసిందే.

గురువారం రాత్రి 11:30 గంటల సమయానికి ఈ వాయుగుండం నైరుతి బంగాళాఖాతంలో గంటకు తొమ్మిది కిలోమీటర్ల వేగంతో సుడులు తిరుగుతూ ఆగ్నేయ దిశగా కదులుతోంది. ప్రస్తుతానికి శ్రీలంకలోని ట్రింకోమలి- 240, తమిళనాడులోని నాగపట్నం- 330, పుదుచ్చేరి- 390, చెన్నై- 430 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

శ్రీలంకలోని ట్రింకోమలికి ఆగ్నేయ దిశగా 190, తమిళనాడులోని నాగపట్నానికి ఆగ్నేయం- తూర్పు ఆగ్నేయ దిశగా 470, పుదుచ్చేరికి ఆగ్నేయ దిశగా 580, చెన్నైకి 670 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. శనివారం ఉదయం ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరం సమీపంలో కారైకల్- మహాబలిపురం మధ్య పుదుచ్చేరి సమీపంలో తీరం దాటుతుంది. ఆ సమయంలో తీరం వెంట గంటకు 45 నుంచి 65 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

దీని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఏపీలో దక్షిణ కోస్తా జిల్లాలైన ప్రకాశం, నెల్లూరు, రాయలసీమలోని తిరుపతి, చిత్తూరు, కడప జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని, మిగిలినచోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

రెండు రోజుల్లో కాంచీపురం, తిరువళ్లూర్, తిరువారూర్, తంజావూరు, పుదుక్కోట్టై, అరియలూరు, పెరంబలూరు, నీలగిరి, కోయంబత్తూర్, తిరుచ్చి, తెన్‌కాశి, తిరునెల్వేలి.. జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. అతి భారీ వర్షాలు పడుతున్న నేపథ్యలో ఆయా జిల్లాలల్లో పాఠశాలలకు సెలవును ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+