అలాంటి ధైర్యం అందరికీ ఉండదు.. రాహుల్ నిర్ణయాన్ని సమర్థించిన ప్రియాంక..
ఢిల్లీ : కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ పంతం నెగ్గించుకున్నారు. పార్టీ పెద్దలు వారించినా, వర్కింగ్ కమిటీ వద్దన్నా పదవి నుంచి వైదొలిగారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ వైఫల్యానికి నైతిక బాధ్యతవహిస్తూ రాజీనామా చేయడంపై రాహుల్ సోదరి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కొందరు మాత్రమే అలాంటి నిర్ణయాలు తీసుకోగలరని, రాహుల్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నానంటూ ఆమె ట్వీట్ చేశారు.
Few have the courage that you do @rahulgandhi. Deepest respect for your decision. https://t.co/dh5JMSB63P
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 4, 2019
"నీలాగా నిర్ణయాలు తీసుకునే ధైర్యం కొందరికి మాత్రమే ఉంటుంది. నీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నా." అని రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ ప్రియాంక ట్విటర్‌లో ట్వీట్ చేశారు.

2017 డిసెంబర్ 16న కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీ ఆ పదవికి రాజీనామా చేసినట్లు బుధవారం అధికారికంగా ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు నాలుగు పేజీల లేఖను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్‌కు పూర్వవైభవం తెచ్చేందుకు కఠిన నిర్ణయాలు అవసరమన్న ఆయన.. పార్టీని పూర్తిగా సంస్కరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తన స్థానంలో కొత్త ప్రెసిడెంట్‌ను ఎంపిక చేసే బాధ్యతను ఒక బృందానికి అప్పగించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి సూచించారు.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు












Click it and Unblock the Notifications