పగవాడికి ఇలాంటి పరిస్థితులు వద్దు, సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఏకుమేకైన భార్య !
బెంగళూరు/గదగ్: ప్రతి ఎన్నికల్లో ప్రతి పార్టీలో సొంత పార్టీ నాయకుల నుంచి టిక్కెట్లు సంపాధించుకునే విషయంలో టాప్ లీడర్లకు పోటీ ఉంటుంది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికట్లో ఈ పోటీ ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ ఓ విచిత్రమైన సంఘటన ఎదురైయ్యింది. సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఆయన భార్యతో పాటు సోదరుడే పోటీకి వచ్చి ఈసారి మాకు టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల పోటింగ్ కు కచ్చితంగా నెల రోజుల మాత్రమే టైమ్ ఉంది. ఇప్పటికే కాంగ్రెస్, జేడీఎస్, గాలి జానర్దన్ రెడ్డి కేఆర్ పీ పార్టీలో కొంత మంది అభ్యర్థుల పేర్లు ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే ఇంత వరకు బీజేపీ హైకమాండ్ ఒక్క అభ్యర్థి పేరు కూడా ప్రకటించకపోవడం, ఢిల్లీలో చర్చలు జరుపుతూనే ఉండటంతో ఆ పార్టీ నాయకుల్లో అయోమయం నెలకొంది.

గదగ్ లోని రోణ సిట్టింగ్ ఎమ్మెల్యే కళకప్ప బండికి ఇంటి పోరు మొదలైయ్యింది. రోణ నియోజక వర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కళకప్ప బండికి పోటీగా ఇప్పుడు మొత్తం ఐదు మంది టాప్ లీడర్లు మాకే టిక్కెట్ ఇవ్వాలి అంటే లేదు మాకే టిక్కెట్ ఇవ్వాలి అంటూ బీజేపీ హైకమాండ్ మీద ఒత్తిడి తేస్తున్నారు. ఇందులో సిట్టింగ్ ఎమ్మెల్యే భార్య సంయుక్తా బండి, ఎమ్మెల్యే సోదరుడు సిద్దప్ప బండి టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారు.
నా సోదరుడు కళకప్ప బండి పేరుకు మాత్రమే ఎమ్మెల్యే అయ్యాడని, కరోనా సమయంలో కూడా ప్రజలను ఏమాత్రం ఆదుకోలేదని, అలాంటి వ్యక్తికి ఈసారి టిక్కెట్ ఇస్తే రోణలో బీజేపీ సీటు గల్లంతు అవుతుందని ఎమ్మెల్యే సోదరుడు సిద్దప్ప బహిరంగంగా ఆరోపిస్తున్నారు. రోణలో బీజేపీ బతకాలంటే ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చి 40 ఏళ్లుగా బీజేపీకి సేవ చేస్తున్న తనకే టిక్కెట్ ఇవ్వాలని సిద్దప్ప అంటున్నారు.
నా భర్తకు 20 ఏళ్లుగా నేను రాజకీయంగా సహకారం అందిస్తున్నానని, తాను పొలిటికల్ సైన్స్ పీజీ చదివానని, మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్న తనకే టిక్కెట్ ఇవ్వాలని సిట్టింగ్ ఎమ్మెల్యే భార్య సంయక్తా బండి బీజేపీ నాయకులకు మనవి చేస్తోంది. ఎమ్మెల్యే కళకప్ప ఫ్యామిలీ డ్రామాలు ఆడుతున్నదని ఆ నియోజక వర్గంలో టిక్కెట్ ఆశిస్తున్న బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కళకప్ప బండి మీద ఇప్పటికే మాజీ సీఎం బీఎస్, యడియూరప్ప, సీఎం బసవరాజ్ బోమ్మయ్ హెలిప్యాడ్ లోనే మండిపడిన వీడియో కొన్ని నెలల క్రితం వైరల్ అయ్యింది. ఇప్పటికే మాజీ మంత్రి సీసీ పాటిల్ ను రోణ నియోజక వర్గం అభ్యర్థిగా ప్రకటించిన కాంగ్రెస్ నాయకులు ఆ సీటు సొంతం చేసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications