Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్‌పై ఈసీ గరం.. FIR నమోదు చేయాలంటూ ఆదేశం

ఢిల్లీ : పొలిటిషియన్ గా మారిన టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కు.. రాజకీయ క్షేత్రంలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఢిల్లీ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన గౌతమ్ గంభీర్ కు షాక్ మీద షాక్ తగులుతోంది. రెండు ఓట్లు కలిగి ఉన్నారన్న వివాదం సద్దుమణగకముందే మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల ప్రచార ర్యాలీకి అనుమతి తీసుకోలేదనే కారణంతో.. కేంద్ర ఎన్నికల సంఘం ఆయనపై సీరియస్ అయింది.

File FIR against BJP’s Gambhir for holding rally without permission says EC

ఇటీవలే కమల తీర్థం పుచ్చుకున్న గౌతమ్ గంభీర్.. తూర్పు ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. అయితే, ఏప్రిల్ 25వ తేదీన జంగ్‌పురా ప్రాంతంలో ప్రచార ర్యాలీ నిర్వహించాడు. ఈసీ రూల్స్ ప్రకారం.. ర్యాలీ నిర్వహించాలంటే ముందస్తు పర్మిషన్ తీసుకోవాలి. కానీ అలాంటిదేమీ లేకుండానే ర్యాలీ సాగింది. దాంతో ఆయనపై స్థానికంగా కేసు ఫైల్ చేయాల్సిందిగా తూర్పు ఢిల్లీ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ను ఆదేశించింది ఈసీఐ.

ఇటీవల గౌతం గంభీర్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఆప్ లీడర్ అతిషి ఆయనకు వ్యతిరేకంగా కేసు ఫైల్ చేశారు. కరోల్ బాగ్ తో పాటు రాజిందర్ నగర్ లో రెండుచోట్ల ఆయనకు ఓటు హక్కు ఉందనేది ప్రధాన ఆరోపణ. నామినేషన్ సందర్భంగా తప్పుడు సమాచారం పొందుపరిచారని కంప్లైంట్ లో పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+