ఢిల్లీలో ఆప్ కు మద్దతుగా నటుడు ప్రకాష్ రాజ్ ప్రచారం. ద్వేష రాజకీయాలు, ప్రజల్లో మార్పు !
Recommended Video
న్యూఢిల్లీ: నేను అమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు కాదని, కనీసం కార్యకర్త కాదని, మంచి గెలవాలనే ఉద్దేశంతో ఆపార్టీ తరపున ప్రచారం చేస్తున్నానని ప్రముఖ బహుబాష నటుడు, దర్శక నిర్మాత ప్రకాష్ రాజ్ అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆప్ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించానని ప్రజలకు మనవి చేస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో కలిసి ప్రకాష్ రాజ్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.

7 లోక్ సభ నియోజక వర్గాలు
ఢిల్లీలోని 7 లోక్ సభ నియోజక వర్గాలకు మే 12వ తేదీన ఎన్నికలు జరుగుతున్నాయి. లోక్ సభ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థులను గెలిపించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో సహ అనేక మంది నాయకులు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.ప్రముఖ నాయకులతో పాటు నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఆప్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.

ద్వేష రాజకీయాలు
ఢిల్లీలో బుధవారం మీడియాతో మాట్లాడిన నటుడు ప్రకాష్ రాజ్ మత ఘర్షణలు, ద్వేష రాజకీయాలను ప్రోత్సహించడంతో దేశం పరువుపోతున్నదని విచారం వ్యక్తం చేశారు. అందు కోసమే ఢిల్లీలో ఆప్ అభ్యర్థులను గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడలని తాను ఎన్నికల ప్రచారం చేస్తున్నానని ప్రకాష్ రాజ్ వివరించారు.

వారం రోజులు ర్యాలీలు
బెంగళూరు సెంట్రల్ లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన ప్రకాష్ రాజ్ కు ఆప్ మద్దతు ఇచ్చింది. ఇప్పుడు ఆప్ ను గెలిపించాలని ప్రకాష్ రాజ్ ఢిల్లీలో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. వారం రోజుల పాటు ప్రకాష్ రాజ్ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో కలిసి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.

ఇలాంటి పార్టీలు కావాలి
సమాజంలో మార్పు తీసుకువచ్చే పార్టీలు మనకు అవసరం అని ప్రకాష్ రాజ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ద్వేష రాజకీయాలు రూపుమాపి ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం కోసం ప్రతి ఒక్కరూ శ్రమించాలని ప్రకాష్ రాజ్ పిలుపునిచ్చారు. ఆప్ ను గెలిపిస్తే ఢిల్లీ శాంతియుతంగా ఉంటుందని ప్రకాష్ రాజ్ అన్నారు.

సుడిగాలి పర్యటన
ఢిల్లీ తూర్పు, ఢిల్లీ ఈశాన్యం, చాందిని చౌక్ తదితర లోక్ సభ నియోజక వర్గాల్లో ప్రకాష్ రాజ్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఆప్ అభ్యర్థులతో కలిసి రోడ్ షోలలో పాల్గొంటున్న ప్రకాష్ వారిని గెలిపించాలని మనవి చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం త్వరలోనే పూర్తి చేస్తామని, అంత వరకు ప్రకాష్ రాజ్ ప్రచారం చేస్తారని ఆప్ పార్టీ నాయకులు గోపాల్ రాయ్ అన్నారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications