ఆర్థిక అంశాలపై నిర్మలమ్మ ప్రెస్ మీట్: ఆ కేసుపై కీలక ప్రకటన?

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మరికాసేపట్లో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఓ ముఖ్యమైన ఆర్థిక పరమైన ంశాల గురించి ఈ సమావేశంలో ఆమె మాట్లాడనున్నారు.అంతే కాకుండా ఆంట్రిక్స్ దేవాస్ కేసు గురించి కూడా ఆమె మాట్లాడతారని కేంద్ర ఆర్థికశాఖ విడుదల చేసిన అడ్వయిజరీ ద్వారా తెలుస్తోంది.

నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్, నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన దేవాస్ మల్టీమీడియా ప్రైవేట్ లిమిటెడ్‌కు అక్కడ కూడా చుక్కెదురైంది. ఈ అప్పీల్‌ను సుప్రీంకోర్టు జనవరి 17వ తేదీన డిస్మిస్ చేసింది. ఇదే అంశాలు కాకుండా బడ్జెట్ 2022 పై కూడా ఆమె చర్చించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇక నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్‌లోని అంశాలు మినిట్-టూ-మినిట్ మీకోసం

 Nirmala sitharaman will address a press conference regarding Antrix Devas case.

Jan 18, 2022, 5:33 pm IST

దేవాస్ కంపెనీకి లిక్విడేషన్ ప్రాసెస్ ప్రక్రియను ప్రారంభిస్తున్నాం: నిర్మలా సీతారామన్
Jan 18, 2022, 5:03 pm IST

యూపీఏ ప్రభుత్వం ప్రజలను దేశాన్ని ఎలా తప్పుదోవ పట్టించిందో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తెలియజేస్తోంది. ఇక కాంగ్రెస్ ఇలాంటి తప్పుడు ఒప్పందాలు ఎలా చేయాల్సి వచ్చిందో దేశానికి చెప్పాలి: నిర్మలా సీతారామన్
Jan 18, 2022, 5:00 pm IST

2011లో మొత్తం ఒప్పందం రద్దవడంతో దేవాస్ అంతర్జాతీయ ఆర్బిట్రరీని ఆశ్రయించింది. భారత ప్రభుత్వం ఒక ఆర్బిట్రేటర్‌ను అపాయింట్ చేయాల్సిందిగా ఆదేశాలు వచ్చాయి.. కానీ నియమించుకోలేదు: నిర్మలా సీతారామన్
Jan 18, 2022, 4:58 pm IST

వేవ్‌లెంగ్త్, స్పెక్ట్రమ్, శాటిలైట్ వంటివి ప్రైవేట్ పార్టీలకు అప్పగించి సొమ్ము చేసుకుంది. ఆ తర్వాత ఒప్పందం కుదుర్చుకుని కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టింది: నిర్మలా సీతారామన్
Jan 18, 2022, 4:50 pm IST

యూపీఏ హయాంలో ఆంట్రిక్స్ -దేవాస్ ఒప్పందం 2005లో జరిగింది: నిర్మలా సీతారామన్
Jan 18, 2022, 4:48 pm IST

ఈ ఒప్పందం మోసపూరితమైనది:నిర్మలా సీతారామన్
Jan 18, 2022, 4:47 pm IST

2011లో యూపీఏ ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని రద్దు చేసింది: నిర్మలా సీతారామన్
Jan 18, 2022, 4:46 pm IST

ఆంట్రిక్స్ దేవాస్ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై నేను మాట్లాడాలని ప్రెస్ మీట్ నిర్వహించాను: నిర్మలా సీతారామన్
Jan 18, 2022, 4:04 pm IST

ఆంట్రిక్స్ దేవాస్ కేసుపై కీలక ప్రకటన చేసే అవకాశం
Jan 18, 2022, 3:58 pm IST

పలు ఆర్థికపరమైన అంశాలపై మాట్లాడనున్న నిర్మలా సీతారామన్
Jan 18, 2022, 3:57 pm IST

కాసేపట్లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+