Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Budget 2024: నేడే కేంద్ర బడ్జెట్: నిర్మలా సీతారామన్ రికార్డు, ఆశలకు రెక్కలొచ్చేనా?

న్యూఢిల్లీ: మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం తొలి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది. మంగళవారం ఉదయం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. గతంతో పోలిస్తే బీజేపీకి లోక్‌సభ స్థానాలు తగ్గడం, త్వరలో పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ బడ్జెట్‌లో జనాకర్షక నిర్ణయాలు ఉండవచ్చనే అంచనాలు ఉన్నాయి.

ఆయుష్మాన్‌ భారత్‌ కింద ఆరోగ్య బీమా లబ్ధిదారులు, బీమా మొత్తం పెంపు, ఆదాయపు పన్ను విషయంలో ఉపశమనాలు సహా సామాజిక, సంక్షేమ వ్యయాలను పెంచే అవకాశాలున్నాయి. కొత్త పద్దులో అభివృద్ధి, సంక్షేమాల మధ్య ప్రభుత్వం సమతూకం పాటించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

Finance Minister Nirmala Sitharaman will present the budget in the Lok Sabha today

మరోవైపు, ఈ బడ్జెట్‌పై చాలా రాష్ట్రాలు ఆశలు పెట్టుకున్నాయి. ఇక, మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలైతే నిధుల కేటాయింపులపై మరిన్ని ఆశలు పెట్టుకున్నాయి. అయితే, పార్లమెంటులో ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు నెలకొల్పనున్నారు.

నిర్మలా సీతారామన్ 2019, మే 30 నుంచి ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్నారు. ఆమె ఇప్పటి వరకు వరుసగా ఏడుసార్లు పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టారు. గతంలో వరుసగా ఆరుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రిగా మొరార్జీ దేశాయ్ పేరు మీదున్న రికార్డును నేటితో నిర్మలా సీతారామన్ చెరిపేయనున్నారు. మరోవైపు, సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు కూడా నిర్మలా సీతారామన్‌పైనే ఉంది. 2020 ఫిబ్రవరి 1 బడ్జెట్‌ను బడ్జెట్ ప్రవేశపెడుతూ 2 గంటల 40 నిమిషాలు ప్రసంగించారు

కాగా, మంగళవారం ఉదయం 9 గంటలకు ఆర్థిక శాఖ కార్యాలయం నుంచి రాష్ట్రపతి భవన్‌కు వెళ్లనున్నారు మంత్రి నిర్మలా సీతారామన్. 9.30 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశం కానున్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు పార్లమెంటుకు చేరుకుంటారు. మంగళవారం ఉదయం 10.15 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది.

కేంద్ర మంత్రివర్గ సమావేశం అనంతరం ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ భేటీ అనంతరం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ప్రారంభించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.

ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ ఆర్థిక సర్వే 2023-24ను సోమవారం లోక్‌​సభలో ప్రవేశపెట్టారు. సర్వే వివరాలను వెల్లడించారు. 2024-25 ఆర్థిక సంవత్సారానికిగాను దేశ వాస్తవ జీడీపీ 6.5-7 శాతం వరకు వృద్ధి చెందుతుందని అంచనా వేశారు. బడ్జెట్‌ 2024-25లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై చాలా నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. దాదాపు 11 దశల్లో దీనిపై చర్చలు జరిగాయని తెలిపారు. ముఖ్యంగా 63 నేరాలను డీక్రిమినలైజేషన్ చేయడం వల్ల ప్రస్తుతం కంపెనీలు సమర్థంగా కొనసాగుతున్నాయని ఆమె వివరించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+