ఆర్థికరంగ బలోపేతం కోసం చర్యలు, ఎఫ్‌డీఐలు మరింత పెరుగతాయని నిర్మలా సంకేతాలు
న్యూఢిల్లీ : ఆర్థిక మాంద్యం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ఆటో మొబైల్ దిగ్గజ కంపెనీలు తమ ఉత్పత్తిని ఆపివేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుత పరిస్థితిని మీడియాకు వివరించారు. గత త్రైమాసికంలో దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 5 శాతానికి చేరడంతో ఆర్థిక నిపుణులు ఆందోళన చెందారు. దీంతో దిద్దుబాటు చర్యలు తీసుకున్నామని భరోసా నిచ్చారు నిర్మలా సీతారామన్.
ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని నిర్మలా వివరించారు. అయితే ఎగుమతులపై పన్ను తగ్గింపుపై మాత్రం పునరాలోచన చేస్తున్నామని వివరించారు. ఈ ఏడాది వృద్ధి రేటు ఆశాజనంగానే ఉందని వివరించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మరింత పెరిగే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చారు. క్రెడిట్ గ్యారంటీ స్కీంతో పరిస్థితులు మరింత మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. టైక్స్ టైల్ ఎగుమతుల కోసం కొత్త పథకం అమలులోకి తీసుకొస్తామని వివరించారు.

Recommended Video
వచ్చే ఏడాది నుంచి వస్త్ర ఎగుమతుల కోసం కొత్త పథకం అమలు చేస్తామని హామీనిచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ఇండియా స్థానం మరింత మెరుగైందని .. భయపడాల్సిన పరిస్థితి ఏం లేదని చెప్పారు. ఆర్థిక రంగం బలోపేతం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఇందుకు ప్రభుత్వ బ్యాంకుల్లో వితరణ లాభిస్తోందని చెప్పారు. మరోవైపు షాపింగ్ మాల్‌లో మెగా షాపింగ్ ఫెస్టివల్ పెడతామని .. ఇది ఆర్థికవృద్ధికి దోహదపడుతుందని అంచనా వేశారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications