రూల్ ఆఫ్ లా: పంజాబ్ సీఎంకు జరిమానా.. కారణమిదే
రూల్ బ్రేక్ చేస్తే శిక్ష పడాల్సిందే. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ నివాసానికి జరిమానా విధించారు. చెత్త పారబోశారంటూ చండీగఢ్‌లోని సీఎం భగవంత్ మాన్ నివాసానికి రూ.10 వేల జరిమానాను చండీఘడ్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వేశారు. సీఆర్పీఎఫ్ బెటాలియన్ డిప్యూటీ సూపరింటెండెంట్ హర్జీందర్ సింగ్ పేరుతో చలాన్ జారీ అయింది. పంజాబ్ సీఎం ఇంటి చిరునామా స్పష్టంగా పేర్కొన్నారు.

స్థానిక బీజేపీ కౌన్సిలర్ మహేశిందర్ సింగ్ సిద్ధు స్పందించారు. సీఎం నివాసం నుంచి చెత్త పారబోస్తున్నారని స్థానికుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. చెత్తను రోడ్డు మీద పారవేయొద్దని సీఎం నివాసంలోని వారికి మున్సిపల్ సిబ్బంది పలుమార్లు చెప్పారట. అయినప్పటికీ ఫలితం కనిపించలేదని వివరించారు. దీంతో చలాన్ జారీ అయిందని తెలిపారు.
ప్రజాస్వామ్యంలో అందరూ ఒక్కటే.. కానీ కొందరు రూల్స్ బ్రేక్ చేస్తారు. ఇక్కడ నిబంధనల మేరకు నడుచుకున్నారు. కానీ సీఎం మాన్ వ్యతిరేకులు చలాన్ విధించారు. అదే బీజేపీకి చెందిన వారి ప్రమేయంతో చలాన్ విధించినట్టు తెలిసింది. మరీ దీనిపై ఆప్ స్పందించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications