కాపీ కొడుతూ పట్టుబడి, టీచర్‌నే చంపుతానన్నాడు
బరేలీ: ఓ విద్యార్థి ప్రవర్తన ఉపాధ్యాయులను భయాందోళనకు గురి చేసింది. పరీక్షల్లో కాపీ కొడుతూ దొరికిపోయిన ఓ విద్యార్థి.. అవమానంతో తలదించుకోకుండా ఉపాధ్యాయుడిపైనే ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేగాక, చంపుతానని బెదిరింపులకు గురిచేశాడు.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. పవన్ శర్మ అనే ఉపాధ్యాయుడు ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలకు స్క్వాడ్‌గా ఉన్నారు. విధుల్లో భాగంగా ఆకాశ్ అనే విద్యార్థి కాపీ కొడుతుండగా పట్టుకున్నారు.

అతడి నుంచి స్లిప్స్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని సస్పెండ్ చేశారు. దీంతో పవన్‌పై కసి పెంచుకున్న ఆకాశ్... బెదిరింపు మెసేజ్‌లు పంపడం ప్రారంభించాడు. పలుమార్లు చంపేస్తానంటూ వెంటపడ్డాడు. దీంతో బరేలీ కాలేజ్ టీచర్స్ అసోషియేషన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
ఆకాశ్‌ను అరెస్టు చేయకుంటే మార్చి 19 నుంచి పరీక్షలను బహిష్కరిస్తామని హెచ్చరించింది. దీంతో పోలీసులు ఆకాశ్‌పై ఎఫ్ఐర్ నమోదు చేసి కేసు విచారణ చేస్తున్నారు. కాగా, ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో తరచూ చోటు చేసుకుంటుండటం ఆందోళన కలిగించే అంశమే.












Click it and Unblock the Notifications