మామూలు మస్కా కాదు.. డమ్మీ నంబర్ ప్లేట్.. ఏకంగా రతన్ టాటా కారు నంబర్‌తో...
ముంబైలో ఓ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కారు నంబర్‌ను (ఎంహెచ్01 డికె 0111) ఓ మహిళ తన కారుకు వాడుకుంటోంది. సాధారణంగా వాహనదారులు ట్రాఫిక్ చలాన్ల బారినపడకుండా ఉండేందుకు నంబర్ ప్లేట్ కనిపించకుండా జిమ్మిక్కులు చేయడం సర్వ సాధారణం. కానీ ఈ మహిళ ఏకంగా రతన్ టాటా కారు నంబర్‌ను వాడుతూ ట్రాఫిక్ పోలీసులకు మస్కా కొట్టడం గమనార్హం.
ఇటీవల ఆ కారు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడంతో పోలీసులు ఈ-చలాన్లు విధించారు. రతన్ టాటా సిబ్బంది ఈ విషయం తెలుసుకుని పోలీసులను ఆశ్రయించారు. ఏయే ప్రాంతాల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్లు పోలీసులు చెప్తున్నారో... ఇటీవలి కాలంలో ఆ ప్రాంతాలకు తమ కారు వెళ్లలేదని చెప్పారు. బహుశా ఎవరైనా నకిలీ నంబర్ ప్లేట్ వాడుతుండొచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు దీనిపై విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగుచూసింది.

రతన్ టాటా కారు నంబర్‌ను మరో మహిళ తన కారుకు వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమెను గీతాంజలి సామ్ షాగా గుర్తించి కేసు నమోదు చేశారు. అయితే గీతాంజలి మాత్రం.. ఆ నంబర్ రతన్ టాటాది అన్న విషయం తనకు తెలియదని పోలీసులతో చెప్పారు. అంతేకాదు,ప్రముఖ న్యూమరాలజిస్ట్ ఒకరు ఇచ్చిన సూచన మేరకు తాను ఆ కారు నంబర్ వాడుతున్నట్లు తెలిపారు. జీవితంలో మంచి స్థానంలో ఉండాలంటే ఆ నంబర్ వాడాలని న్యూమరాలజిస్ట్ చెప్పినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ డమ్మీ నంబర్ ప్లేట్ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications