ఎంత చెప్పినా వీరు మారరు: ఈ బీజేపీ నేత ఎలాంటి వ్యాఖ్యలు చేశాడంటే...?
ఉత్తర్ ప్రదేశ్ : ఎన్నికల వేళ ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని తెలిసినప్పటికీ కూడా నేతల్లో ఏమాత్రం మార్పు రావడం లేదు. యదేచ్చగా కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతూ ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ అధినేత్రి మాయవతిల వ్యాఖ్యలపై సీరియస్ అయిన ఎన్నికల సంఘం... వారి ప్రచారానికి బ్రేక్ కూడా వేసింది. మరి ఇన్ని తెలిసీ కూడా కింది స్థాయి నేతల్లో మాత్రం మార్పు రావడం లేదు.

తాజాగా ముస్లిం సామాజిక వర్గానికి వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బుక్ అయ్యారు బీజేపీ నేత రంజిత్ బహదూర్ శ్రీవాస్తవ. ఆయన చేసిన వ్యాఖ్యలపై విచారణ జరుగుతోంది. గురువారం ఓ సభను ఉద్దేశించి మాట్లాడిన రంజిత్ శ్రీవాస్తవ బీజేపీకి ఓటు వేయాలంటూ అక్కడి ప్రజలను అభ్యర్థించారు. మోడీని ప్రధానిగా చేసుకుంటేనే ముస్లింల ధైర్యాన్ని అణిచివేయొచ్చంటూ ప్రసంగించారు.

ముస్లింలు అధికారంలోకి రావాలని విపరీతంగా ప్రయత్నిస్తున్నారని అయితే వారు గెలవడం అసాధ్యమని జోస్యం చెప్పారు శ్రీవాస్తవ. హిందువులంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైంది. అందరూ బీజేపీకి ఓటు వేసి ముస్లింలు అధికారంలోకి రాకుండా చూడాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications