వాటికా ఎండీ, డైరెక్టర్ లపై చీటింగ్ కేసు
గుర్ గావ్: వాటికా గ్రూప్ కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ ఎండీ, ఇద్దరు డైరెక్టర్ల పై చీటింగ్ కేసు నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు. ఒక కోటి రూపాయల మేరకు మోసం చేసినందుకు తాము కేసు నమోదు చేశా మని పోలీసు అధికారులు అన్నారు.
వాటికా గ్రూప్ ఎండీ గౌతమ్ భల్లా, ఆ సంస్థ డైరెక్టర్లు అనిల్ భల్లా, గౌరవ్ భల్లాల పై ఐపీసీ సెక్షన్ 406, 420ల కింద కేసులు నమోదు అయ్యాయని గుర్ గావ్ పోలీసు అధికారులు అన్నారు. ఢిల్లీ లోని మాలవీయ నగర్ కు చెందిన రాజ్ కమల్ భాటియా వీరి మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రాజ్ కమల్ భాటియా ఫిర్యాదు మేరకు తాము కేసులు నమోదు చేశామని పోలీసు అధికారులు చెప్పారు. అనిల్ భల్లా, ఆయన కుమారులు కోటి రూపాయల మేరకు మోసం చేశారని బాధితుడు రాజ్ కమల్ భాటియా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 2009 డిసెంబర్ లో ఓ విల్లా కొనుగోలు కోసం భాటియా ఈ మొత్తం చెల్లించారని సమాచారం.
అయితే రాజ్ కమల్ భాటియాకు ఆ విల్లా ఇవ్వలేదని, నగదు తిరిగి చెల్లించలేదని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. విల్లా ఇవ్వలేదని, నగదు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు తనను బెదిరిస్తున్నారని భాటియా పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. పోలీసు శాఖలోని ఆర్థిక అక్రమాల విభాగం అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications