రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతలపై కేసులు: ఇదే కారణమన్న అస్సాం సీఎం హిమంత
గౌహతి: అస్సాంలో ఘర్షణలు సృష్టించినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు నేతలపై పోలీసు కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ వెల్లడించారు. అస్సాంలో భారత్ జోడో న్యాయ్ యాత్రలో హింస, రెచ్చగొట్టడం, దాడి చేసినందుకు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, కన్హయ్య కుమార్, ఇతర పార్టీ కార్యకర్తలపై కేసు నమోదు చేసినట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మంగళవారం తెలిపారు.
మంగళవారం తెల్లవారుజామున అస్సాంలోని గౌహతిలో రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర కొనసాగుతుండగా పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. శనివారం జరిగిన మార్చ్‌పై 'బీజేపీ గూండాలు' దాడి చేశారని ఆరోపిస్తూ అస్సాంలో జరిగిన ర్యాలీలో రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ తీవ్ర విమర్శల దాడి చేసింది.

సోషల్ మీడియా పోస్ట్‌లో హిమంత శర్మ మాట్లాడుతూ, "కాంగ్రెస్ సభ్యులు ఈ రోజు హింసాత్మక చర్యలు, రెచ్చగొట్టడం, ప్రజా ఆస్తులకు నష్టం కలిగించడం, పోలీసులపై దాడి చేయడం వంటి చర్యలను ప్రస్తావిస్తూ.. రాహుల్ గాంధీ, కెసి వేణుగోపాల్, కన్హయ్య కుమార్, ఇతర వ్యక్తులపై PDPP చట్టంలోని సెక్షన్ 120(B)143/147/188/283/353/332/333/427 IPC R/W సెక్షన్ 3 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది' అని అస్సాం సీఎం పేర్కొన్నారు.
బారికేడ్లను బద్దలు కొట్టేందుకు "జనసమూహాన్ని రెచ్చగొట్టినందుకు" గాంధీపై కేసు నమోదు చేయాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)ని ముఖ్యమంత్రి ఆదేశించిన కొన్ని గంటల తర్వాత ఈ కేసు నమోదైంది. 'జనసమూహాన్ని రెచ్చగొట్టినందుకు మీ నాయకుడు రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయాలని నేను డీజీపీని ఆదేశించాను' అని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ బీవీ ట్విట్టర్ పోస్ట్‌పై ముఖ్యమంత్రి స్పందించారు.
With reference to wanton acts of violence, provocation , damage to public property and assault on police personnel today by Cong members , a FIR has been registered against Rahul Gandhi, KC Venugopal , Kanhaiya Kumar and other individuals under section…
— Himanta Biswa Sarma (@himantabiswa) January 23, 2024
రాహుల్ గాంధీపై రాష్ట్ర పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేస్తారని, లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆయనను అరెస్టు చేస్తామని అస్సాం ముఖ్యమంత్రి మంగళవారం ఉదయం ప్రకటించారు. ఖానాపరా ప్రాంతంలో పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ ఘటన తరువాత.. రాహుల్ గాంధీ సుమారు 3000 మంది వ్యక్తులు, 200 వాహనాలతో గౌహతిలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారని సీఎం ఆరోపించారు.
These are not part of Assamese culture. We are a peaceful state. Such “naxalite tactics” are completely alien to our culture.
— Himanta Biswa Sarma (@himantabiswa) January 23, 2024
I have instructed @DGPAssamPolice to register a case against your leader @RahulGandhi for provoking the crowd & use the footage you have posted on your… https://t.co/G84Qhjpd8h
గౌహతిలో 3000 మంది, 200 వాహనాలు వస్తే పరిస్థితి ఎలా ఉండేదో మనం ఊహించుకోవచ్చు. ఆరు రోజులుగా మేం ఆయనకు సౌకర్యంగా ఉన్న మార్గంలో వెళ్లమని చెబుతున్నాం కానీ, గౌహతి మధ్య మార్గంలో వెళ్లవద్దని చెప్పాం. దీంతో వారు (కాంగ్రెస్ కార్యకర్తలు) పోలీసులతో ఘర్షణ పడ్డారు' అని అస్సాం ముఖ్యమంత్రి మీడియాకు తెలిపారు. కాగా, మణిపూర్ నుంచి అస్సాంలో ప్రవేశించిన రాహుల్ భారత్ జోడో న్యాయ్ యాత్ర జనవరి 25 వరకు అస్సాంలో కొనసాగనుంది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications