జైపూర్ లోని ప్రభుత్వ హాస్పిటల్‌లో అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి !!
రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ (ఎస్‌ఎంఎస్) ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు ( అక్టోబర్ 6, 2025 ) తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఆరుగురు అగ్నికి ఆహుతి అయ్యారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. దీంతో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా విషాదం నింపుతోంది.
షార్ట్ సర్క్యూట్‌తో మంటలు..
కాగా ఈ ప్రమాదం ఆసుపత్రిలోని ట్రామా సెంటర్ రెండవ అంతస్తు న్యూరో ఐసీయూ వార్డులో జరిగినట్టు చెబుతున్నారు. స్టోర్‌రూమ్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి.. కొన్ని క్షణాల్లోనే వేగంగా వ్యాపించాయని చెబుతున్నారు. మంటలకు ఫైళ్లు, రక్త నమూనా గొట్టాలు, వైద్య పరికరాలు, మంచాలు పూర్తిగా కాలిపోయాయి. ట్రామా సెంటర్ ఇన్‌చార్జ్ డాక్టర్ అనురాగ్ ధాకడ్ మాట్లాడుతూ.. మంటలు చెలరేగిన వెంటనే విద్యుత్ వ్యవస్థలు పనిచేయకపోవడంతో ఆక్సిజన్ సరఫరా ఆగిపోయిందని అన్నారు. రోగులు ఇప్పటికే కోమాలో ఉండటంతో పరిస్థితి మరింత విషమించిందని తెలిపారు.

ప్రమాదం సమయంలో ట్రామా సెంటర్‌లోని రెండు ఐసీయూల్లో కలిపి 24 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. వారిలో 11 మంది ట్రామా ఐసీయూలో, 13 మంది సెమీ-ఐసీయూలో ఉన్నారని డాక్టర్ అనురాగ్ వివరించారు. మరణించిన వారిలో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారని విచారం వ్యక్తం చేశారు. అలానే గాయపడిన బాధితుల్లో కొందరికి శ్వాస సమస్యలు.. మరికొందరికి తీవ్రమైన కాలిన గాయాలు ఉన్నాయన్నారు. వారిని ప్రస్తుతం ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డుకు తరలించి, మెరుగైన చికిత్స అందిస్తున్నామని స్పష్టం చేశారు.
ఇక సమాచారం అందిన వెంటనే ఫైర్ సర్వీస్ బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. మొత్తం ఐదు ఫైరింజన్లు, పది మంది అగ్నిమాపక సిబ్బంది సుమారు ఒక గంట పాటు ప్రయత్నించి మంటలను అదుపులోకి తెచ్చారు.
షార్ట్ సర్క్యూట్ కారణమా?
మరోవైపు అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాన్ని కనుగొనడానికి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్‌ఎస్‌ఎల్) బృందం ఘటనాస్థలాన్ని పరిశీలించింది. మొదటి దృష్టికి షార్ట్ సర్క్యూట్‌నే కారణమని భావిస్తున్నా, ఎలక్ట్రికల్ వైర్లలో లోపం ఉందా? పరికరాల నిర్వహణలో నిర్లక్ష్యం జరిగిందా? అనే అంశాలపై కూడా దర్యాప్తు సాగుతోంది. ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ ఎస్‌ఎంఎస్ ఆసుపత్రిని సందర్శించారు. ఆయన వైద్యులతో, రోగుల కుటుంబాలతో మాట్లాడి ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రిలో సేఫ్టీ ప్రమాణాలపై సమగ్ర సమీక్ష చేయాలని అధికారులను ఆదేశించారు.
మరణించిన రోగుల కుటుంబాలకు తక్షణ సాంత్వన అందజేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చేందుకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే జైపూర్ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదన రేపింది. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కూడా ఘటనపై స్పందించారు. జైపూర్ ఆసుపత్రి అగ్నిప్రమాదం దురదృష్టకరం. మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాము. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం అని అధికార ప్రకటనలో పేర్కొన్నారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications