ఫిషింగ్ హార్బర్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 12 బోట్లు దగ్ధం

ఒడిశా రాష్ట్రంలోని ఫిషింగ్ హార్పర్‌లో గురువారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జగత్ సింగ్‌పుర్ జిల్లా పారాదీప్ ఫిషింగ్ హార్బర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంో సుమారు 12 బోర్టలు పూర్తిగా దగ్ధమయ్యాయి. భారీ ఎత్తున నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు.

ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నాయి. భారీ ఎత్తున చెలరేగిన మంటలను సుదీర్ఘంగా శ్రమించి అదుపులోకి తీసుకొచ్చారు. అయితే, అగ్ని ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.

Fire accident at Odisha fishing harbour 12 boats gutted


హార్బర్‌లోని ఒకటో నెంబర్ జెట్టీలో ఉన్న ఓ బోటులో మొదట మంటలు చెలరేగాయి. ఆ తర్వాత ఆ మంటలు మిగితా బోట్లకు కూడా వ్యాపించాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఒక్కో బోటులో 3000 లీటర్ల డీజిల్ ఉన్నట్లు సమాచారం.

ప్రస్తుతం మంటు పూర్తిగా అదుపులోకి వచ్చాయని పారాదీప్ ఏడీఎం నిరంజన్ బెహ్రా తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో హార్బర్‌లో మొత్తం 50 పెద్ద పడవలు, 400 చిన్న పడవలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మంటలను వేగంగా ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.

ఇది ఇలా ఉండగా, హైదరాబాద్ నగరంలోనూ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పాతబస్తీలోని బహదూర్‌పురాలో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లారీ మెకానిక్ వర్క్‌షాప్‌లో చెలరేగిన మంటలు సమీపంలోని చెట్లకు వ్యాపించాయి. ఆ తర్వాత పక్కనవున్న భవనాలకు వ్యాపించడతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

సమాచారం అందడంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. భారీగా ఎగిసిపడుతున్న మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఎత్తున మంటలు వ్యాపిస్తుండటంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. అగ్రి ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, గతంలో కూడా ఇదే మెకానిక్ వర్క్ షాప్‌లోఅగ్ని ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+