ఎయిమ్స్‌లో చెలరేగిన మంటలు, షార్ట్ సర్క్యూట్ వల్లే ఇన్సిడెంట్ ?
ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం గ్రౌండ్ ప్లోర్‌లో గల ట్రామాకేర్ సెంటర్ నుంచి మంటలు చెలరేగాయి. ఆపరేషన్ థియేటర్ ప్రాంగణంలో ప్రమాదం జరిగినట్టు తమకు సాయంత్రంం 6.13 గంటలకు సమాచారం అందినట్టు అగ్నిమాపక సిబ్బంది పేర్కొన్నారు. వెంటనే ఘటనాస్థలానికి ఫైర్ సిబ్బంది వెళ్లి, మంటలార్పుతున్నారని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రమాదం జరుగలేదని, రోగులను మరో వార్డుకు తరలించినట్టు తెలిపారు. ఆపరేషన్ థియేటర్‌లో షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్టు అధికారులు అనుమానిస్తున్నారు.













Click it and Unblock the Notifications