వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రయాగ్‌రాజ్‌ కుంభమేళలో భారీ అగ్ని ప్రమాదం

|
Google Oneindia TeluguNews

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దిగంబర్ అఖాడా ప్రాంతంలో వంటగ్యాస్ సిలిండర్ పేలడంతో ఈ ప్రమాదం సంభించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఘటనకు సమీపంలో పెద్ద ఎత్తున టెంట్లు ఉన్నాయి. ఫైర్ సిబ్బంది అప్రమత్తతతో మంటలు వ్యాపించలేదు. వెంటనే వారు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

Fire at Kumbh Mela camp in Prayagraj after suspected cylinder blast

వంట గ్యాస్ సిలిండర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడ్డాయి. ఆ ప్రాంతం మొత్తన్ని దట్టమైన పొగలు కమ్మేశాయి. ఎగిసి పడుతున్న మంటలను ఫైర్ సిబ్బంది అదుపులోకి తీసుకురావడంతో ఆ ప్రాంతమంతా కాలిపోయిన వస్తువులు దర్శనమిచ్చాయి. ప్రాంతంలో దుర్వాసన కూడా వస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదిలా ఉంటే మంటల కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ప్రయాగా రాజ్ కుంభమేల భద్రతా అధికారి నిర్ధారించారు. ఇదిలా ఉంటే కుంభమేళ జనవరి 15 నుంచి అధికారికంగా ప్రారంభం కానున్నాయి. ప్రయాగరాజ్‌లో ప్రతి ఆరేళ్లకోసారి కుంభమేళా నిర్వహిస్తారు. ఈ కుంభమేళలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అలహాబాదుకు తరలివస్తారు. గంగా యమునా నదుల్లో పవిత్ర స్నానంను భక్తులు ఆచరిస్తారు.

English summary
A fire broke out at a camp set up for the Kumbh Mela in Prayagraj this afternoon. Several tents are believed to have been charred due to the Kumbh Mela fire, which was quickly brought under control.Nobody was killed or injured in the fire.A cylinder blast is believed to be the cause of the fire. The suspected blast and the fire took place in a camp set up by the Digambar Akhada in Sector 16 of Prayagraj.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X