షారుక్ ఖాన్ నివాసం సమీపంలో అగ్నిప్రమాదం.. 14వ అంతస్తులో ఎగిసిపడుతోన్న మంటలు
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బాంద్రాలో గల హై రైస్ భవనంలో మంటలు చెలరేగాయి. 14వ అంతస్తులో మంటలు అంటుకున్నాయి. అయితే ఈ భవనం బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నివాసానికి అతీ సమీపంలో ఉంది. ఘటనాస్థలానికి ఫైరింజన్లు చేరుకున్నాయి. 8 ఫైరింజన్లు మంటలను ఆర్పివేయడంలో నిమగ్నం అయ్యాయి.

కడపటి వరకు ఉన్న సమాచారం మేరకు ఇప్పటివరకు ప్రాణ నష్టం ఏమీ సంభవించలేదు. ఆస్తినష్టం అయితే సంభవించింది. హై రైస్ బిల్డింగ్‌ను జివేశ్ భవనం అని కూడా పిలుస్తారు. ఆ భవనం 21 అంతస్తులు ఉంది. 14వ అంతస్తులో మంటలు వ్యాపించాయి. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంతో ఆ చుట్టుపక్కల జనం భయాందోళనకు గురయ్యారు. మిగతా వారు బిక్కుబిక్కుమంటూ వెళ్లదీశారు.












Click it and Unblock the Notifications