విషాదం: హాస్టల్‌లో అగ్నిప్రమాదం, ముగ్గురు బాలికల మృతి, మరొకరికి గాయాలు..

చండీగఢ్ పెయింట్ గెస్ట్ హాస్టల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఎలా వ్యాపించాయో తెలియరాలేదు. శనివారం మంటలు ఎగిసిపడటంతో అందులో ఉన్న ముగ్గురు బాలికలు సజీవ దహనమయ్యారు. మంటల నుంచి తప్పించుకునేందుకు మరో బాలిక సాహసమే చేశారు. భవనంపై నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఇద్దరు పంజాబ్, ఒకరు హర్యానాకు చెందినవారని అధికారులు తెలిపారు.

Fire breaks out at PG in Chandigarh, 3 girls dead

చండీగడ్ సెక్టార్ 32డీ వద్ద గల హాస్టల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదానికి గల కారణంపై క్లారిటీ లేదు. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయా, మరో కారణం ఉందా అనే విషయం విచారణలో తేలనుంది. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. అయితే పేయింగ్ గెస్ట్ హాస్టల్ అక్రమంగా నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. ఎలాంటి అనుమతి తీసుకోలేదని సమాచారం. అక్రమంగా నడవడంతో సంబంధిత అధికారుల దృష్టికి కూడా రాలేదు. ఘటనపై విచారణ జరుపుతున్నామని, బాధ్యుతలపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+