'సెక్స్' కు ఒప్పుకోలేదని, ట్రాన్స్‌జెండర్‌పై 'కాల్పులు'..!
ఢిల్లీ : ఢిల్లీలో జరిగిన ఘటన వింత పోకడలకు అద్దంలా నిలుస్తోంది. విచక్షణ కోల్పోయిన ఇద్దరు యువకులు ట్రాన్స్‌జెండర్ అని చూడకుండా సెక్స్ కోసం ఆరాటపడ్డారు. మూడు రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. 21 సంవత్సరాలున్న ఓ ట్రాన్స్‌జెండర్ ను ఆదివారం అర్ధరాత్రి దాటాక లిఫ్ట్ ఇస్తామంటూ ఇద్దరు యువకులు తమ కారులోకి ఎక్కించుకున్నారు. కొద్దిదూరం వెళ్లాక ఒకడు ట్రాన్స్‌జెండర్ ను వేధించాడు. సెక్స్ చేయాలంటూ పదేపదే మీదకొచ్చాడు. అయితే దీనికి ట్రాన్స్‌జెండర్ ఒప్పుకోకపోవడంతో క్షణికావేశానికి గురయ్యారు ఆ ఇద్దరు యువకులు.

సెక్స్ కోసం ఎంత ప్రయత్నించినా ఒప్పుకోలేదనే కోపంతో ట్రాన్స్‌జెండర్ పై కాల్పులు జరిపారు. అనంతరం కారులో నుంచి రోడ్డు మీదకు తోసేశారు. కొద్ది సమయం తర్వాత ఆ రోడ్డు మీదుగా వెళుతున్న కొందరు వ్యక్తులు రోడ్డుమీద పడి ఉన్న ట్రాన్స్‌జెండర్ ను చూసి హజ్రత్ నిజాముద్దీన్ పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వెంటనే ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ప్రాణపాయం తప్పిందని, ఆరోగ్యం నిలకడగానే ఉందంటున్నారు వైద్యులు. సీసీటీవి ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకుని తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. మరొకడు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications