సుప్రీంకోర్టునూ వదలని కరోనా: ఒకరికి పాజిటివ్, మరో ఇద్దరు క్వారంటైన్లోకి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 30వేలకు చేరుకున్నాయి. ఇప్పటికే పలు ప్రభుత్వ కార్యాలయాలకు వ్యాపించిన కరోనా.. ఇప్పుడు ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు కూడా పాకింది.
Recommended Video

సుప్రీంకోర్టులో కరోనావైరస్..
సుప్రీంకోర్టులో పనిచేసే ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఇద్దరు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్లను క్వారంటైన్‌కు తరలించారు. జ్యూడీషియల్ విభాగంలో పనిచేసే సదరు ఉద్యోగి.. ఏప్రిల్ 16న విధులకు హాజరయ్యారు. ఆ తర్వాత రెండ్రోజులు జ్వరంతో బాధపడ్డారు. కాగా, ఆయనకు కరోనా సోకినట్లు సోమవారం నిర్ధారణ అయ్యింది.

విధులకు హాజరైన ఉద్యోగులందరికీ..
మార్చి 16న కరోనా సోకిన ఉద్యోగి మరో ఇద్దరు రిజిస్ట్రార్లతో సన్నిహితంగా మెలిగారు. ఈ క్రమంలో ఆ ఇధ్దరినీ కూడా సెల్ఫ్ క్వాంటైన్‌కు వెళ్లాలని అధికారులు సూచించారు. అంతేగాక, ఏప్రిల్ 16 నుంచి విధులకు హాజరవుతున్న ఉద్యోగులందరికీ కూడా కరోనా పరీక్షలు నిర్వహించారు. కాగా, కరోనా నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వింటున్న విషయం తెలిసిందే.

ఢిల్లీలో పెరిగిన హాట్ స్పాట్లు, కంటైన్మెంట్లు
కాగా, ఢిల్లీలోనూ కరోనాపాజిటివ్ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 3108 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 877 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 2177 మంది కరోనా రోగులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 54 మంది కరోనాతో మరణించారు. కాగా, ఢిల్లీలో హాట్ స్పాట్-కంటైన్మెంట్ జోన్ల సంఖ్య 97కి పెరిగింది. ఈ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు.

దేశంలో 30వేలకు చేరువలో పాజిటివ్ కేసులు
ఇక దేశంలో 30వేలకు చేరువలో ఉన్నాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. మొత్తం 29,662 మంది కరోనా బారినపడగా, వీరిలో 7174 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 21,548 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 940 మంది కరోనా బారిన పడి మరణించారు.












Click it and Unblock the Notifications