Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

First night: ఫస్ట్ నైట్ బెడ్ రూమ్ లో పెళ్లి కొడుకు ఆత్మహత్య. పెళ్లి కూతురు చూసి, ఏం జరిగిందింటే !

చెన్నై: ఒకే ఫ్యామిలీలోని యువతి, యువకుడికి పెళ్లి చెయ్యాలని కుటుంబ సభ్యులు, బంధువులు నిర్ణయించారు. వివాహం చేసుకోవడానికి యువతి, యుకుడు కూడా సరే అన్నారు. వినాయక చవితి ముందే ఆ ఇంట్లో పెళ్లి సందడి మొదలైయ్యింది. రెండు కుటుంబాలు చాలా దగ్గర బంధువులు కావడంతో బంధువులు అందరూ పెళ్లికి హాజరైనారు. సంతోషంగా యువతి యువకుడి పెళ్లి జరిగిపోయింది. హమ్మయ్యా ఎలాంటి ఇబ్బంది లేకుండా పెళ్లి జరిగిపోయిందని అందరూ అనుకున్నారు.

పంతులు చెప్పిన టైమ్ చూసుకున్న కుటుంబ సభ్యులు రాత్రి పెళ్లి కుమార్తెను శోభనం గదిలోకి పంపించి తరువాత వారి కుటుంబ సభ్యులు అటువైపు వెళ్లకుండా ఎవరిపాటికి వాళ్లు సైలెంట్ గా నిద్రపోయారు. ఫస్ట్ నైట్ దంపతులు ఇద్దరూ సంతోషంగా గడిపి ఉంటారని అందరూ అనుకున్నారు. మరుసటి రోజు ఉదయం పెళ్లి కూతురు గట్టిగా కేకలు వేసింది. వెంటనే రూమ్ లోకి వచ్చి చూడాలని పెళ్లి కూతురు కేకలు వేసింది. కుటుంబ సభ్యులు పరిగెత్తుకుంటూ వెళ్లి చూడగా ఫస్ట్ నైట్ రూమ్ లో బెడ్ మీద ఉండవలసిన పెళ్లి కొడుకు అదే రూమ్ లో ఫ్యాన్ కు వేలాడుతూ శవమై కనిపించడం కలకలం రేపింది.

 సొంత అత్త కూతురు

సొంత అత్త కూతురు

తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలోని తిరుముళైవయల్ సమీపంలోని నెల్వాయి ప్రాంతంలో కార్తికేయన్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కార్తికేయన్ అత్త వాసంతి. వాసంతికి నందిని అనే కుమార్తె ఉంది. చాలాకాలం నుంచి నందిని, కార్తికేయన్ కు వివాహం చెయ్యాలని రెండు కుటుంబాల పెద్దలు అనుకున్నారు.

 సంతోషంగా పెళ్లి జరిగిపోయింది

సంతోషంగా పెళ్లి జరిగిపోయింది

వివాహం చేసుకోవడానికి కార్తికేయన్, నందిని కూడా సరే అన్నారు. వినాయక చవితి ముందే ఆ ఇంట్లో పెళ్లి సందడి మొదలైయ్యింది. రెండు కుటుంబాలు చాలా దగ్గరి బంధువులు కావడంతో బంధువులు అందరూ కార్తికేయన్, నందిని పెళ్లికి హాజరైనారు. సంతోషంగా నందిని, కార్తికేయన్ ల పెళ్లి సంతోషంగా జరిగిపోయింది.

 ఫస్ట్ నైట్ కు రూమ్ లోకి అమ్మాయిని పంపించారు

ఫస్ట్ నైట్ కు రూమ్ లోకి అమ్మాయిని పంపించారు

హమ్మయ్యా ఎలాంటి ఇబ్బంది లేకుండా నందిని, కార్తికేయన్ పెళ్లి జరిగిపోయిందని అందరూ అనుకున్నారు. పంతులు చెప్పిన టైమ్ చూసుకున్న కుటుంబ సభ్యులు రాత్రి 11. 30 గంటల సమయంలో పెళ్లి కుమార్తె నందినిని శోభనం గదిలోకి పంపించారు. అప్పటికే పెళ్లి కొడుకు కార్తికేయన్ అదే రూమ్ లో ఉన్నాడు.

లైట్ లు మొత్తం ఆపేశారు

లైట్ లు మొత్తం ఆపేశారు

పెళ్లి కూతురు నందిని ఫస్ట్ నైట్ రూమ్ లోకి వెళ్లిపోయిన తరువాత వారి కుటుంబ సభ్యులు అటువైపు వెళ్లకుండా ఎవరిపాటికి వాళ్లు సైలెంట్ గా నిద్రపోయారు. పెళ్లి కొడుకు కార్తికేయన్, పెళ్లి కూతురు నందిని సిగ్గుపడకుండా ఉండాలని ఇంటిలోని లైట్ లు మొత్తం అపేసి ఎవరిపాటికి వాళ్లు గురకపెట్టి నిద్రపోయారు. ఫస్ట్ నైట్ నవ దంపతులు ఇద్దరూ సంతోషంగా గడిపి ఉంటారని అందరూ అనుకున్నారు.

 బిత్తరపోయిన పెళ్లి కూతురు

బిత్తరపోయిన పెళ్లి కూతురు

పెళ్లి జరిగిన రోజు బెడ్ రూమ్ లోకి వెళ్లిన మరుసటి రోజు ఉదయం పెళ్లి కూతురు నందిని ఆమె ఉన్న రూమ్ లో గట్టిగా కేకలు వేసింది. ఏం జరిగిందో అనే భయంతో కుటుంబ సభ్యులు వెంటనే రూమ్ లోకి వెళ్లి చూసి షాక్ అయ్యారు. కుటుంబ సభ్యులు పరిగెత్తుకుంటూ వెళ్లి చూడగా ఫస్ట్ నైట్ రూమ్ లో బెడ్ మీద ఉండవలసిన పెళ్లి కొడుకు కార్తికేయన్ అదే రూమ్ లో ఫ్యాన్ కు వేలాడుతూ శవమై కనిపించడం కలకలం రేపింది.

 ఫస్ట్ నైట్ రోజు ఏం జరిగిందంటే ?

ఫస్ట్ నైట్ రోజు ఏం జరిగిందంటే ?

కార్తికేయన్ శవాన్ని కిందకు దించిన కుటుంబ సభ్యులు అతను చనిపోయాడని నిర్దారించుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. తరువాత పెళ్లి కూతురు నందిని ఏం జరిగింది అంటూ కుటంబ సభ్యులు, పోలీసులు మెల్లిగా ఆడిగారు. అర్దరాత్రి కార్తికేయన్ చాలా ఆందోళనతో టెన్షన్ పడి కొంతసేపు బాత్ రూమ్ లో ఉండిపోయాడని నందిని చెప్పింది.

 సరే రేపు చూసుకుందాం

సరే రేపు చూసుకుందాం

నాకు చాలా టెన్షన్ గా ఉందని, ఎక్కువ భయం వేస్తోందని కార్తికేయన్ చెప్పాడని, సరే ఈ రోజు నిద్రపోదాము, తరువాత చూసుకుందామని నేను నచ్చచెప్పానని, తరువాత ఇద్దరూ నిద్రపోయామని నందిని పోలీసులకు చెప్పింది. రెండు సార్తు కార్తికేయన్ బాత్ రూమ్ కు వెళ్లి వచ్చాడని, తరువాత నేను నిద్రపోయిన తరువాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని నందిని పోలీసులకు చెప్పిం

Recommended Video

    Ys Jagan Govt చేసింది ఇదీ.. చేయబోతోంది ఇదీ | Ap Jobs Calendar 2021 || Oneindia Telugu
     ఫస్ట్ నైట్ ఏం జరిగిందో ఎవ్వరికీ తెలీదు

    ఫస్ట్ నైట్ ఏం జరిగిందో ఎవ్వరికీ తెలీదు

    శోభనం రోజు భర్త కార్తికేయన్ ఆత్మహత్య చేసుకోవడంతో నందిని కూడా షాక్ లో ఉందని, అందరూ కొంచెం కోలుకున్న తరువాత విచారణ చెయ్యాలని డిసైడ్ అయ్యామని పోలీసులు అంటున్నారు. కార్తికేయన్ శవాన్ని పోస్టుమార్టుంకు పంపించారు. ఫస్ట్ నైట్ రోజు పెళ్లి కొడుకు బెడ్ రూమ్ లో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఎవరికి తోచినట్లు వారు ఊహించుకోవడంతో హాట్ టాపిక్ అయ్యింది. పెళ్లి కొడుకు ఫస్ట్ నైట్ రోజు పెళ్లి కూతురు గదిలో ఉన్న సమయంలో ఆత్మహత్య చేసుకోవడం అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు సమీప బంధువులు కావడంతో ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలిసే అవకాశం ఉంటుందని పోలీసులు అంటున్నారు. గతంలో ఏమైనా పెళ్లి కొడుక్కి ఆరోగ్య సమస్యలు ఉన్నాయా ?, ఆ విషయం బయటపడకుండా కార్తికేయన్ ఏమైనా దాచిపెట్టాడా ? అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే రాత్రి నేను నిద్రపోయానని, ఉదయం నిద్రలేచి చూస్తే కార్తీకేయన్ ఆత్మహత్య చేసుకున్నాడని పెళ్లి కూతురు చెబుతోంది. మొత్తం మీద రెండు మూడు రోజులు అయితే కాని ఫస్ట్ నైట్ రోజు ఏమి జరిగిందో అనే విషయంలో క్తారిటీ రాదని ఓ పోలీసు అధికారి అంటున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+