Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

First Night: నా భార్య ఎక్కడంటే అక్కడ కొరికేసింది, చంద్రముఖి సినిమా చూపిస్తోంది, మీరే కాపాడండి, కేసు!

లక్నో/ఉత్తరప్రదేశ్: పెద్దలు కుదుర్చిన పెళ్లి గ్రాండ్ గా జరిగింది. వివాహం చేసుకున్న నవ దంపతులు పగలు అంతా బందువులతో సంతోషంగా గడిపారు. పెళ్లికి వచ్చిన బందువులు, స్నేహితులు, సన్నిహితులు ఆ రోజు సాయంత్రం వెళ్లిపోయారు. రాత్రి దంపతుల శోభనానికి ఏర్పాట్లు చేశారు. రాత్రి శోభనం గదిలోకి వెళ్లారు. తరువాత సీన్ రివర్స్ అయ్యింది. మరుసటి రోజు భర్త దిగులుగా కనిపించాడు. మరుసటి రోజు రాత్రి దంపతులు వారి బెడ్ రూమ్ లోకి వెళ్లారు, మరుసటి రోజు భర్త అదే దిగులుగా బందువులకు కనపడ్డాడు. మూడోరోజు రాత్రి భర్త కేకలు వేసుకుంటూ బెడ్ రూమ్ లో నుంచి బయటకు పరుగు తీశాడు.

పెళ్లి కొడుకు చెప్పిన మాటలు విన్న కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. మరుసటి రోజు పోలీస్ స్టేషన్ కు వెళ్లిన భర్త నా భార్య నుంచి మీరే నన్ను కాపాడండి అంటూ వేడుకున్నాడు. ఫస్ట్ నైట్ రోజు నుంచి బెడ్ రూమ్ లో నా భార్య ఇలా చేస్తోంది, అలా చేస్తోంది అంటూ భర్త పిన్ టూ పిన్ చెప్పిన మ్యాటర్ మొత్తం తెలుసుకున్న పోలీసులు ఏం చెయ్యాలో తెలీక తలలు పట్టుకున్నారు.

గ్రాండ్ గా పెళ్లి జరిగింది

గ్రాండ్ గా పెళ్లి జరిగింది

ఉత్తరప్రదేశ్ లోని ఆలీగఢ్ జిల్లాలోని కండెయా గ్రామంలో నివాసం ఉంటున్న రంజిత్ కుమార్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడికి పెళ్లి చెయ్యాలని అతని కుటుంబ సభ్యులు, స్వప్నా (పేరు మార్చడం జరిగింది) అనే అమ్మాయి కుటుంబ సభ్యులతో మాట్లాడుకున్నారు. పెద్దలు కుదుర్చిన పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది.

 శోభనం గదిలోకి దంపతులు ఎంట్రీ

శోభనం గదిలోకి దంపతులు ఎంట్రీ

వివాహం చేసుకున్న నవ దంపతులు రంజిత్ కుమార్, స్వప్నా పగలు అంతా వాళ్ల బందువులతో సంతోషంగా గడిపారు. రంజిత్ కుమార్, స్వప్నాల పెళ్లికి వచ్చిన బందువులు, స్నేహితులు, సన్నిహితులు ఆ రోజు సాయంత్రం వరకకు అక్కడే ఉండి తరువాత ఒక్కొక్కరు వాళ్లవాళ్ల ఊర్లకు వెళ్లిపోయారు. రాత్రి రంజిత్ కుమార్, స్వప్నా దంపతుల శోభనానికి ఏర్పాట్లు చేశారు. రాత్రి రంజిత్ కుమార్, స్వప్నా దంపతులు శోభనం గదిలోకి వెళ్లారు.

రెండు రోజులు బెడ్ రూమ్ లో నుంచి దిగులుగా వచ్చిన భర్త

రెండు రోజులు బెడ్ రూమ్ లో నుంచి దిగులుగా వచ్చిన భర్త

ఫస్ట్ నైట్ మరుసటి రోజు రంజిత్ కుమార్ బెడ్ రూమ్ లో నుంచి దిగులుగా బయటకు వచ్చి బంధువులకు కనిపించాడు. మరుసటి రోజు రాత్రి రంజిత్ కుమార్, స్వప్నా దంపతులు వారి బెడ్ రూమ్ లోకి వెళ్లారు, మరుసటి రోజు రంజిత్ కుమార్ అంతే దిగులుగా బందువులకు కనపడ్డాడు. మూడోరోజు రాత్రి బెడ్ రూమ్ లో నుంచి రంజిత్ కుమార్ కేకలు వేసుకుంటూ బయటకు పరుగు తీశాడు.

నా పెళ్లామ్ శాడిస్టు

నా పెళ్లామ్ శాడిస్టు

బయటకు వచ్చిన రంజిత్ కుమార్ తలకు గాయం అయ్యి రక్తం కారుతుండటంతో ఏం జరిగింది ? అంటూ అతని కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. అర్దరాత్రి 12 గంటల సమయంలో నిద్రపోతున్న తనను నిద్రలేపిన నా భార్య స్వప్నా నా తల గొడకు వేసి చితకబాదిందని రంజిత్ కుమార్ బోరున విలపించాడు. మరుసటి రోజు రంజిత్ కుమార్ స్థానిక పోలీస్ స్టేషన్ కు పరుగు తీశాడు.

మందు తాగేసి ఎక్కడంటే అక్కడ కోరికేసింది

మందు తాగేసి ఎక్కడంటే అక్కడ కోరికేసింది

రాత్రి బెడ్ రూమ్ లోకి లిక్కర్ బాటిల్స్ తెచ్చుకున్న నా భార్య పీకలదాక మద్యం సేవించి నా రెండు చేతులు కోరికేసిందని, నా బట్టలు తీసేసి శరీరం మీద ఎక్కడంటే అక్కడ కొరికేసిందని రంజిత్ కుమార్ పోలీసులకు చెప్పాడు. నా భార్య కొరికిన కొరుకుడుకు నా శరీరం అంతా గాయాలు అయ్యాయని రంజిత్ కుమార్ బట్టలు తీసి చూపించడంతో పోలీసులు బిత్తరపోయాడు.

నా భార్య చంద్రముఖి సినిమా చూపిస్తోంది

నా భార్య చంద్రముఖి సినిమా చూపిస్తోంది

అర్దరాత్రి పూట నా భార్య గాజలు పగలగొట్టిందని, అద్దం కూడా పగలగొట్టి ఆ అద్దాలతో తన శరీరం మీద గాయాలు చేసిందని, నా భార్య స్వప్నా నాకు చంద్రముఖి సినిమా చూపిస్తోందని, మీరే నన్ను కాపాడాలని, ఆమెతో నేనే కాపురం చెయ్యలేనని రంజిత్ కుమార్ పోలీసుల ముందు లబోదిబో అంటూ ఏడ్చేశాడు.

నా భార్య నన్ను చంపేస్తుంది

నా భార్య నన్ను చంపేస్తుంది

నా భార్యను ఇలాగే వదిలేస్తే కచ్చితంగా నన్ను చంపేస్తోందని, నా భార్యకు మద్యం తాగడంతో పాటు గంజాయి సేవించే అలవాటు ఉందని, మూడు రోజులు రాత్రి పూట నేను చూశానని, మీరే నా ప్రాణాలు కాపాడాలని రంజిత్ కుమార్ పోలీసులకు మనవి చేశాడు. ఫస్ట్ నైట్ రోజు భార్య ఎలా టార్చర్ పెట్టిందో అని విషయం రంజిత్ కుమార్ చెప్పడంతో పోలీసులు బిత్తరపోయారు.

 భర్త రివర్స్ కేసుతో పోలీసులు షాక్

భర్త రివర్స్ కేసుతో పోలీసులు షాక్

ఎక్కడైనా పస్ట్ నైట్ రోజు నా భర్త టార్చర్ పెట్టాడు అంటూ భార్యలు కేసులు పెడుతారని, ఇక్కడ ఏంది రివర్స్ లో భర్త అతని భార్య మీద కేసు పెట్టాడని హడలిపోయిన పోలీసులు కేస విచారణ చేస్తున్నారు. రంజిత్ కుమార్ భార్యకు మతిస్థిమితం లేదని పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు ఆరోపించడంతో ఆమెను ఆసుపత్రికి తరలించి వైద్యపరీక్షలు చేయిస్తున్నామని ఆలీగఢ్ జిల్లా పోలీసు అధికారులు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+