First night: శోభనం రోజు సినిమా చూపించిన కొత్తపెళ్లికూతురు, హల్వా చేసి అందరికి పెట్టి !

రాత్రి శోభనం గదిలోకి వెళ్లిన మహిళ ఆమె భర్తకు స్వర్గం చూపించింది. అంతే మరుసటి రోజు ఉదయం నిద్రలేచి చూసిన కొత్త పెళ్లి కొడుకు బిత్తరపోయారు. కొత్త పెళ్లికూతురు సినిమా చూపించిందని తెలిసి షాక్ అయ్యారు.

లక్నో/ఉత్తరప్రదేశ్: బాగా డబ్బులు ఉన్న యువకుడు చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. చదువుకున్న అమ్మాయి అయితే తన పిల్లలను బాగా చూసుకుంటుందని, తనకు చదువు అంతంతమాత్రమే అని అనుకున్నాడు. స్నేహితుల సలహామేరకు ఓ అమ్మాయిని ఆ యువకుడు పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికూతురు ఆమె భర్త ఇంటికి వెళ్లి భర్త కుటుంబ సభ్యులకు స్వయంగా హల్వా చేసింది. అదే రోజు రాత్రి శోభనం గదిలోకి వెళ్లిన మహిళ ఆమె భర్తకు స్వర్గం చూపించింది. అంతే మరుసటి రోజు ఉదయం నిద్రలేచి చూసిన కొత్త పెళ్లి కొడుకు, అతని కుటుంబ సభ్యులు, బంధువులు బిత్తరపోయారు.

 మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి

మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా చికేతా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన నీరజ్ కుమార్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు, నీరజ్ కుమార్ వ్యవసాయం చేయిస్తున్నాడు. నీరజ్ కుమార్ కు డబ్బు, ఆస్తులు ఎక్కువగానే ఉన్నాయి. చదువుకున్న అందమైన మహిళను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని నీరజ్ కుమార్ అతని స్నేహితులకు చెబుతూ వస్తున్నాడు.

 పెళ్లి సెట్ చేసిన ఫ్రెండ్స్

పెళ్లి సెట్ చేసిన ఫ్రెండ్స్

ఆ సందర్భంలో హరిద్వార్‌లో నివసించే నీరజ్ కుమార్ స్నేహితులు సంజయ్, అమిత్‌లకు అక్కడ నివసించే ఒక అమ్మాయి మాకు తెలుసు. ఆ అమ్మాయి మంచి మనసున్నదని, ఆమెను పెళ్లి చేసుకోమని అతనికి సలహా ఇచ్చారు.నీరజ్ కుమార్ అతని స్నేహితుల మాటలు విని హరిద్వార్ లో నివాసం ఉంటున్న రేఖా అనే మహిళను చూసేందుకు అతని కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. అక్కడ రేఖా కుటుంబ సభ్యులు, నీరజ్ కుమార్ కుటుంబ సభ్యులు పెళ్లి చర్చలు జరిపారు.

 పెళ్లి చేసినందుకు రూ. 1 లక్ష బహుమతి

పెళ్లి చేసినందుకు రూ. 1 లక్ష బహుమతి

పెళ్లి చర్చలు ఫలించడంతో హరిద్వార్ లోనే జనవరి 24వతేదీన నీరజ్ కుమార్, రేఖాల వివాహం జరిగింది. హరిద్వార్‌లో రేఖాను వివాహం చేసుకున్న వరుడు నీరజ్ కుమార్ పెళ్లి సక్రమంగా జరిపించిన అతని స్నేహితులు అమిత్, సంజయ్‌లకు లక్ష రూపాయలు బహుమతిగా ఇచ్చాడు. పెళ్లి తరువాత నీరజ్ కుమార్ నవవధువు రేఖాతో కలిసి అతని స్వగ్రామానికి చేరుకున్నాడు. జంట చూడముచ్చటగా ఉందని గ్రామస్తులు అందరూ నీరజ్ కుమార్ కుటుంబ సభ్యులకు చెప్పారు.

 ఫస్ట్ నైట్ కు స్వయంగా హల్వా చేసిన కొత్త పెళ్లికూతురు

ఫస్ట్ నైట్ కు స్వయంగా హల్వా చేసిన కొత్త పెళ్లికూతురు

నూతన వధూవరులకు ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేశారు. వరుడు నీరజ్ కుమార్ కుటుంబానికి వధువు రేఖా ఆమె చేతులతో స్వయంగా ఆ రోజు హల్వా తయారు చేసింది. ఆ హల్వాలో పెళ్లికూతురు రేఖా ముందుగానే మత్తు మందు కలిపి భర్త నీరజ్ కుమార్ తో పాటు అతని కుటుంబ సభ్యులు, బంధువులు అందరికీ ఇచ్చింది. అదే రోజు ఫస్ట్ నైట్ కావడంతో రేఖా ఆమె భర్త నీరజ్ కుమార్ కు కొంతసేపు స్వర్గం చూపించింది. తరువాత మత్తు మందు తిన్న కొత్త పెళ్లికొడుకు నీరజ్ కుమార్ గురకపెట్టి నిద్రపోయాడు.

 శోభనం రోజు సినిమా చూపించిన కొత్త పెళ్లికూతురు

శోభనం రోజు సినిమా చూపించిన కొత్త పెళ్లికూతురు

నీరజ్ కుమార్ ఫస్ట్ నైట్ రోజు అతని కుటుంబ సభ్యులు హల్వా తిని అపస్మారకస్థితితో మరుసటి రోజు ఉదయం చాలాసేపు వరకు నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయం వధువు రేఖా కనపడకపోవడంతో నీరజ్ కుమార్ తో పాటు అతని కుటుంబ సభ్యులు హడలిపోయారు. రేఖాతో పాటు ఇంటిలో ఉన్న నగలు, డబ్బు మాయం కావడంతో నీరజ్ కుటుంబ సభ్యులు హడలిపోయారు.

 పెళ్లికూతురు ఇల్లు ఖాలీ

పెళ్లికూతురు ఇల్లు ఖాలీ

అపస్మారక స్థితిలో నుంచి తేరుకున్న వరుడు నీరజ్ కుమార్ కుటుంబీకులు రేఖా అసలు మ్యాటర్ తెలుసుకుని షాక్‌కు గురయ్యారు. ఇరుగుపొరుగున వెతికినా రేఖా ఆచూకి చిక్కలేదు. పోలీసులకు సమాచారం ఇస్తే పరువు పోతుందని అనుకున్న నీరజ్ కుమార్ వెంటనే హరిద్వార్‌లోని రేఖా ఇంటికి వెళ్లారు. అయితే అప్పటికే రేఖా ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారని తెలుసుకుని హడలిపోయారు.

 విసిగిపోయి కేసు పెట్టిన పెళ్లికొడుకు

విసిగిపోయి కేసు పెట్టిన పెళ్లికొడుకు

అప్పటి నుంచి రేకా కోసం నీరజ్ కుమార్, అతని కుటుంబ సభ్యులు, బంధువులు గాలిస్తున్నారు. రేఖా పెళ్లి అంతా డబ్బుల డ్రామా అని తేలిపోయింది,. ఈ సంఘటన జరిగిన 22 రోజుల తరువాత నీరజ్ కుమార్ మమ్మల్ని మోసం చేసిన రేఖాతో పాటు ఆమె ముఠాను పట్టుకుని శిక్షించాలని పోలీస్ స్టేషన్‌ లో కేసు పెట్టాడు. నీరజ్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు అమిత్, సంజయ్, రేఖాలపై కేసు నమోదు చేసి వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+