First Night: జరక్క జరక్క పెళ్లి జరిగింది, ఫస్ట్ నైట్ పెళ్లాం లేచిపోయింది, లక్షలు పోసి కొంటే !

జైపూర్/ రాజస్థాన్: మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవలని ఓ యువకుడు నానాతంటాలు పడ్డాడు. ఏదో ఒకలోపంతో కొంతమందిని ఇతనే కాదనడం, కొందరు మాకు పెళ్లి కొడుకు నచ్చలేదని చెప్పడంతో ఇంతకాలం అతని పెళ్లి వాయిదాపడుతూ వచ్చింది. పెళ్లి విషయంలో విసిగిపోయిన ఆ వ్యక్తి చివరికి మధ్యవర్తి సహాయంతో పెళ్లికూతురి తండ్రికి రూ. 3 లక్షలు ఇచ్చి అమ్మాయిని కొనుక్కుని మరీ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి జరిగిన రోజు నుంచి 13 రోజుల పాటు ఫస్ట్ నైట్ వాయిదా వేసిన పెళ్లి కూతురు చివరికి ఫస్ట్ నైట్ కు నేను రెఢీ అని చెప్పింది. బెడ్ రూమ్ లో ఫస్ట్ నైట్ చేసుకోవడానికి వెళ్లిన పెళ్లి కొడుకు పూలువాడిపోయినా, అగరబత్తులు ఆరిపోయినా పెళ్లికూతురు బెడ్ రూమ్ లోకి రాకపోవడంతో హడలిపోయాడు. బయటకు వచ్చి ఆరా తీస్తే అప్పుడు పెళ్లికూతురు వేరే వ్యక్తితో జంప్ అని తెలుసుకుని లబోదిబో అంటున్నాడు, జరక్క జరక్క పెళ్లి జరిగితే ఫస్ట్ నైట్ రోజు పెళ్లికూతురు లేచిపోవడం హాట్ టాపిక్ అయ్యింది.

 పెళ్లికోసం నానాతంటాలు

పెళ్లికోసం నానాతంటాలు

రాజస్థాన్ లోని భరత్ పుర జిల్లాలోని బయానా పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగ్లా మదర్ గ్రామంలో నారాయణ సింగ్ గుర్జర్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. చాలా సంవత్సరాల నుంచి నారాయణ సింగ్ పెళ్లి చేసుకోవాలని అనేకచోట్ల పెళ్లి సంబంధాలు చూశాడు. ఏదో ఒకలోపంతో కొంతమందిని నారాయణ సింగ్ కాదనడం, కొందరు మాకు పెళ్లి కొడుకు నచ్చలేదని చెప్పడంతో ఇంతకాలం అతని పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది.

 విసిగిపోవడంతో మధ్యవర్తులు ఎంట్రీ

విసిగిపోవడంతో మధ్యవర్తులు ఎంట్రీ

చాలా పెళ్లి సంబంధాలు పుట్టుక్కున తెగిపోవడంతో నారాయణ సింగ్ విసిగిపోయాడు. వయసు అయిపోతుందని, ఎలాగైనా వెంటనే పెళ్లి చేసుకోని అమ్మాయితో కాపురం చేస్తూ ఎంజాయ్ చెయ్యాలని నారాయణ సింగ్ డిసైడ్ అయిపోయాడు. చివరికి కుటుంబ సభ్యులు, బంధువులను పక్కనపెట్టిన నారాయణ సింగ్ మధ్యవర్తులను ఆశ్రయించాడు.

 రాష్ట్రాన్నే మార్చేశాడు

రాష్ట్రాన్నే మార్చేశాడు

రాజస్థాన్ లో ఎక్కడా పెళ్లి సంబంధాలు సెట్ కాకపోవడంతో మధ్యవర్తి సహాయంతో నారాయణ సింగ్ మధ్యప్రదేశ్ లో ఓ పెళ్లి సంబంధం చూశాడు. పెళ్లికుమార్తె తండ్రికి రూ. 3 లక్షలు ఇచ్చిన నారాయణ సింగ్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. అమ్మాయికి నారాయణ సింగ్ ను పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉందా ? లేదా ? అని ఆమె తండ్రి ఆలోచించకుండా పెళ్లి జరిపించేశాడు.

 13 రోజులు ఫస్ట్ నైట్ వాయిదా

13 రోజులు ఫస్ట్ నైట్ వాయిదా

పెళ్లి జరిగిన రోజు ఫస్ట్ నైట్ చేసుకోవలని ఉబలాటపడిన నారాయణ సింగ్ ఆశల మీద పెళ్లికూతురు నీళ్లు చల్లింది. అరోజు రేపు అంటూ 13 రోజుల పాటు ఫస్ట్ నైట్ జరగనివ్వకుండా పెళ్లికూతురు ఆ ముహూర్తాన్ని వాయిదా వేస్తూ వచ్చింది. ఫస్ట్ నైట్ చేసుకోవాలని నారాయణ సింగ్ చాలా ఆశగా ఎదురుచూశాడు.

 అగరబత్తులు ఆరిపోయాయి..... పూలువాడిపోయాయి

అగరబత్తులు ఆరిపోయాయి..... పూలువాడిపోయాయి

13 రోజుల తరువాత తాను ఫస్ట్ నైట్ కు సిద్దంగా ఉన్నానని పెళ్లికూతురు భర్త నారాయణ సింగ్ కు చెప్పింది. రెండువారాల నుంచి ఆ శుభాకార్యం మొదలుపెట్టాలని వేచి చూసిన నారాయణ సింగ్ ఎగిరిగంతేసి ఫస్ట్ నైట్ కు సర్వం సిద్దం చేశాడు. బెడ్ రూమ్ లో స్వీట్లు పెట్టి పూలతో అలకంరించాడు. పస్ట్ నైట్ చేసుకోవాలని నారాయణ సింగ్ ముందుగానే బెడ్ రూమ్ లోకి దూరేశాడు. అంతే వెలిగించిన అగరబత్తులు ఆరిపోయినా, పూలు వాడిపోతున్నా పెళ్లికూతురు మాత్రం బెడ్ రూమ్ లోకి ఎంట్రీ ఇవ్వలేదు.

 వీడి కష్టం శత్రువులకు కూడా రాకూడదు

వీడి కష్టం శత్రువులకు కూడా రాకూడదు

అర్దరాత్రి దాటిపోయినా పెళ్లికూతురు బెడ్ రూమ్ లోకి ఎంట్రీ ఇవ్వకపోవడంతో నారాయణ సింగ్ బయటకు వచ్చాడు. ఏం జరిగింది ? అని ఆరా తీశాడు. అంతే నారాయణ సింగ్ గుండె ఆగిపోయినంత పని జరిగిపోయింది. రేయ్ పెళ్లికూతురు కనపడటం లేదని అక్కడ ఉన్న బంధువులు చెప్పడంతో నారాయణ సింగ్ ఆశలు పూర్తిగా అడిఆశలు అయిపోయాయి.

 రూ. 3 లక్షలు పోయింది........పెళ్లాం లేచిపోయింది

రూ. 3 లక్షలు పోయింది........పెళ్లాం లేచిపోయింది

రూ 3 లక్షలు ఎదురుకట్నం ఇచ్చి పెళ్లిచేసుకున్నా, ఫస్ట్ నైట్ రోజు పెళ్లాం వేరే వ్యక్తితో లేచిపోవడంతో నారాయణ సింగ్ కు మండిపోయింది. నాకు మీరే న్యాయం చెయ్యండి, నాకు పెళ్లాం కావాలి, లేదా రూ. 3 లక్షలతో పాటు నా పెళ్లికి ఖర్చు అయిన డబ్బులు తిరిగి ఇప్పించి నాకు మీరే న్యాయం చెయ్యాలని నారాయణ సింగ్ పోలీసులను ఆశ్రయించాడు. జరక్క జరక్క నారాయణ సింగ్ పెళ్లి జరగడం, ఫస్ట్ నైట్ రోజు పెళ్లాం లేచిపోవడంతో అతన్ని చూసి అందరూ జాలిపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+