రాత్రిపూట కూడా లక్ష్యాలను చేధించగల అగ్ని-II క్షిపణి ప్రయోగం సక్సెస్

న్యూఢిల్లీ: ఒడిశా తీరంలోని అబ్దుల్ కలాం ద్వీపం నుంచి భారతదేశం తన మొదటి రాత్రిపూట కూడా లక్ష్యాలను ఛేదించగల అగ్ని-II బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది.

ఉపరితలం నుంచి ఉపరితలం లక్ష్యాలను ఛేదించగల ఈ క్షిపణిని విజయవంతంగా పూర్తి చేసినట్లు రక్షణ వర్గాలు వెల్లడించాయి. ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ లాంచింగ్ కాంప్లెక్ 4 నుంచి ప్రయోగించారు.

 First night trial of Agni II missile conducted successfully

ది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్‌డీఓ) ఈ మధ్యరకం క్షిపణిని రూపొందించింది. ఇప్పటికే ఈ క్షిపణిని రక్షణ దళాలకు అందజేయడం జరిగింది.

20 మీటర్ల 2దశల బాలిస్టిక్ క్షిపణి సుమారు 2వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. 17టన్నులున్న ఈ క్షిపణి వెయ్యి కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+