'బోయ్‌ఫ్రెండ్‌తో అభ్యంతరకంగా చూశాను', ' నాపై అత్యాచారం చేశాడు'

భువనేశ్వర్: భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీ క్యాంపస్‌లో ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం చదివే విద్యార్థినిపై అటెండర్ అత్యాచారం చేశారని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్ట్ చేశారు. అయితే తనకు ఏ పాపం తెలియదని నిందితుడు చెబుతున్నారు. తన తప్పును కప్పిపుచ్చుకొనేందుకే యువతి తనపై తప్పుడు ఫిర్యాదులు చేసిందని నిందితుడు చెబుతున్నారు.

భువనేశ్వర్ పట్టణంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చోటు చేసుకొన్న ఈ ఘటన సంచలనం రేకేత్తించింది. అయితే నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి, బాధితురాలు చెబుతున్న మాటలకు పొంతన లేకుండా పోయింది.

అయితే ఇరు వర్గాల వాదనపై పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. అయితే ఈ ఘటనలో ఏం జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నారు.ఈ కేసులో వాస్తవాలను ఆరా తీస్తున్నారు.

అత్యాచారం జరిగిందని ఎంబిబిఎస్ విద్యార్థిని ఫిర్యాదు

అత్యాచారం జరిగిందని ఎంబిబిఎస్ విద్యార్థిని ఫిర్యాదు

భువనేశ్వర్ పట్టణంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ విద్యార్థిని తనపై అత్యాచారం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాలేజీలో పనిచేసే అటెండర్ ఈ పనికి పూనుకొన్నాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది.అయితే అటెండర్ పేరు తెలియకపోవడంతో కాలేజీ యాజమాన్యమే గుర్తించి అతడిని పోలీసులకు అప్పగించారు.

తప్పును కప్పిపుచ్చుకొనేందుకే ఆరోపణలు

తప్పును కప్పిపుచ్చుకొనేందుకే ఆరోపణలు

అయితే తాను అమాయకుడినని తనపై చేసిన ఆరోపణలు నిరాధారమని నిందితుడు అన్నాడు. రాత్రి భోజనం ముగించుకుని క్యాంటీన్‌ నుంచి తిరిగొస్తుండగా ఆ విద్యార్థిని, ఆమె బాయ్‌ఫ్రెండ్‌తో అభ్యంతరకర స్థితిలో ఉండగా చూశానని కాలేజీ అటెండర్ కుంతియా చెప్పారు. ఈ విషయమై ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్ళనున్నట్టు చెప్పానని చెప్పారు. అయితే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని తనను యువతి బతిమిలాడిందన్నారు.

తప్పుడు ఫిర్యాదు

తప్పుడు ఫిర్యాదు

కాలేజీ క్యాంపస్ ఆవరణలో బోయ్‌ఫ్రెండ్‌తో అసభ్యంగా ఉన్న యువతి తన తప్పును కప్పిపుచ్చుకొనేందుకే తనపై పోలీసు కేసు పెట్టిందని కుంతియా ఆరోపించారు. తాను ఆ యువతిని మందలించి వచ్చిన తర్వాత తెల్లవారుజామున పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కుంతియా తెలిపారు.

వైద్య పరీక్షలు

వైద్య పరీక్షలు

ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు కుంతియా, ఆరోపణలు చేసిన బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టు పోలీసులు తెలిపారు. శాస్త్రీయంగా ఈ కేసులో నిర్ధారించేందుకు ప్రయత్నిస్తామని పోలీసులు ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+