గాఢ నిద్రలో ఉన్న సమయంలో: వర్షం నింపిన విషాదం, ఐదుగురు మృతి

తమిళనాడులోని కృష్ణగిరి ప్రాంతంలో ఓ ఇళ్లు కూలిపోయి ఐదుగురు మృత్యువాత పడ్డారు.

చెన్నై: వర్షం ఆ కుటుంబాన్ని బలి తీసుకుంది. బారీ వర్షానికి తమిళనాడులోని కృష్ణగిరిలో ఉన్న ఓ ఇల్లు కూలిపోవడంతో.. ఆ కుటుంబంలోని ఐదుగురు మృత్యువాత పడ్డారు. కుటుంబ సభ్యులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో.. తెల్లవారుజామున 4గం.లకు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ప్రమాదంలో రాధ(65), పుష్ప(35), వసంత(15), భగవతి(13), ముల్లై(8) అక్కడిక్కడే మృతి చెందగా.. గాయపడ్డ మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం కృష్ణగిరి ఆస్పత్రికి తరలించారు. రెస్కూ టీం, ఫైర్‌ సిబ్బంది సహాయంతో శిథిలాల కింద ఉన్న మృత దేహాలను బయటకు తీశారు.

Five of a family die as house collapses near Krishnagiri in Tamil Nadu

అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కృష్ణగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+