మహిళా జర్నలిస్టుపై లైంగిక వేధింపులు: అరెస్ట్

Five arrested for molestation of woman journalist in Andheri
ముంబై: ఓ మహిళా జర్నలిస్టుపై ఐదుగురు దుండగులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం మహారాష్ట్రలోని ముంబైలోని పశ్చిమ అంధేరిలో చోటు చేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. తమ విధులు ముగించుకుని కెమెరా‌మెన్‌తోపాటు బాధిత మహిళ జర్నలిస్టు ఆఫీస్ కారులో ఇంటికి బయల్దేరారు. ఆ సమయంలోని అంధేరిలోని మురికివాడ గుండా వెళుతుండగా ఓ క్రికెట్ బాల్ వచ్చి కారు అద్దాలకు తగిలింది. దీంతో కెమెరా మెన్, స్థానికంగా క్రికెట్ ఆడుతున్న వారితో వాగ్వాదానికి దిగాడు.

దీంతో ఆగ్రహానికి గురైన క్రికెట్ ఆడుతున్న వ్యక్తులు కారుపై దాడికి దిగారు. కెమెరా మెన్, కారు డ్రైవర్ వారితో మళ్లీ తీవ్ర వాగ్వాదానికి దిగారు.

కాగా కారులో ఉన్న మహిళా జర్నలిస్టు పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే గాక ఆమె ఫొటోను తీసేందుకు దాడికి పాల్పడిన వ్యక్తులు ప్రయత్నించారు. దీంతో ఆ మహిళా జర్నలిస్టు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరిపిన పోలీసులు, ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+