స్టేషన్‌లో నిందితుడి పుట్టిన రోజు వేడుకలు.. ఐదుగురు పోలీసుల్ని సస్పెండ్ చేసిన అధికారులు

ముంబై : పోలీస్ స్టేషన్‌లో పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన పోలీసులు అడ్డంగా బుక్కయ్యారు. ఐదుగురు పోలీసులు సస్పెన్షన్‌కు గురయ్యారు. బర్త్ డే సెలబ్రేట్ చేస్తే సస్పెండ్ చేస్తారా అని డౌట్ వచ్చిందా. ఇంతకీ వాళ్లు పుట్టిన రోజు వేడుకలు నిర్వహించింది ఎవరికో తెలిస్తే అవాక్కవడం మీ వంతమవుతుంది. పలు క్రిమినల్ కేసులు ఉన్న ఓ నేరస్థుడి బర్త్ డే సెలబ్రేట్ చేసినందుకు గానూ అధికారులు వారిని సస్పెండ్ చేశారు.

గత శుక్రవారం భాందప్ పోలీస్ స్టేషన్‌లో అయాన్ ఖాన్ అనే ఓ నిందితుడి బర్త్ డేను పోలీసులు సెలబ్రేట్ చేశారు. అతనిపై దాడులకు పాల్పడటం కిడ్నాప్ సహా పలు కేసులున్నాయి. అలాంటి వ్యక్తి పుట్టిన రోజు సంబరాలు జరిపి పోలీసులు చిక్కుల్లో పడ్డారు. సదరు నిందితుడితో కేట్ కట్ చేయించిన సిబ్బంది దాన్ని అతనికి తినిపిస్తూ తాము తింటూ ఎంజాయ్ చేశారు. ఈ బర్త్ డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Five Cops Suspended for Celebrating a criminal birthday inside police station

అయాన్ ఖాన్ బర్త్ డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియో పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో పుట్టిన రోజు వేడుకలు చేసిన ఐదుగురు పోలీసులపై వేటు వేశారు. ఎస్ఐ పంకజ్ షేవలే, సచిన్ కోక్రే, హెడ్ కానిస్టేబుల్ సుభాష్ గోసల్కర్, కానిస్టేబుల్ అనిక్ గైక్వాడ్, మారుతి జుమేడాలను సస్పెండ్ చేశారు. ఐదుగురిపై డిపార్ట్‌మెంటల్ ఎంక్వైరీకి ఆదేశించారు. సిబ్బందిపై పర్యవేక్షణ లోపించిందన్న కారణంతో ఆ రోజు నైట్ డ్యూటీలో ఉన్న పోలీస్ ఇన్స్‌పెక్టర్‌పైనా చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+