లవర్స్ షికార్లు, ప్రియురాలిపై గ్యాంగ్ రేప్ చేయించిన ప్రియుడు, వీడియోలు, గర్భవతి !

చెన్నై: ప్రేమ పేరుతో 9వ తరగతి చదవుతున్న బాలికను సినిమాలు, షికార్లకు తీసుకెళ్లి నమ్మించి అత్యాచారం చెయ్యడమే కాకుండా సాటి స్నేహితులో గ్యాంగ్ రేప్ చేయించి గర్బవతిని చేసిన ఘటన తమిళనాడులోని నాగపట్టణం జిల్లాలో జరిగింది. 14 ఏళ్ల బాలిక గ్యాంగ్ రేప్ కేసులో బాలిక ప్రియుడితో పాటు ఐదు మందిని పోక్స్ చట్టం కింద అరెస్టు చేశామని, మరో ఇద్దరి కోసం గాలిస్తున్నామని పోలీసు నాగపట్టణ జిల్లా ఎస్పీ సెల్వ నాగరత్నం తెలిపారు. బాలిక గర్బవతి కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నామని నాగపట్టణం జిల్లా పోలీసు అధికారి సెల్వ నాగరత్నం తెలిపారు.

హాస్టల్ లో విద్యార్థిని

హాస్టల్ లో విద్యార్థిని

కడలూరు జిల్లా, వడలూరు ప్రాంతానికి చెందిన దంపతులు నాగై వేలంగాణిలోని ప్రైవేటు లాడ్జీ సమీపంలో నివాసం ఉంటూ కార్మికులుగా పని చేస్తున్నారు. ఈ దంపతుల కుమార్తె (14) పుదుచ్చేరిలోని హాస్టల్ లో ఉంటూ 9వ తరగతి చదువుతోంది. తల్లిదండ్రుల దగ్గరకు అప్పుడప్పుడు విద్యార్థిని వచ్చి వెలుతోంది.

పక్కింటికి వెలుతుంటే !

పక్కింటికి వెలుతుంటే !

గత ఏప్రిల్ నెలలో బాలిక తల్లిదండ్రుల దగ్గరకు వచ్చింది. తరువాత విద్యార్థిని అక్కడే రెండు నెలల పాటు ఉంది. ఆ సమయంలో సమీపంలో నివాసం ఉంటున్న దాస్ (41) అనే వ్యక్తి ఇంటికి బాలిక వెళ్లేది. ఆ సమయంలో అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న సూర్యప్రకాష్ అలియాస్ సూర్య (20) అనే యువకుడు బాలికను పరిచయం చేసుకున్నాడు.

ప్రేమ పేరుతో వల

ప్రేమ పేరుతో వల

బాలికతో పరిచయం పెంచుకున్న సూర్య ఆమెను ప్రేమ పేరుతో దగ్గర చేసుకున్నాడు. బాలికను ఇంట్లో విడిచి ఆమె కుటుంబ సభ్యులు పనికి వెలుతున్నారు. ఒంటరిగా ఉంటున్న బాలికను సినిమాలు, షికార్లకు తిప్పిన సూర్య ఆమెపై లైంగిక దాడి చేశాడు. బాలిక ఇంటిలో ఒంటరిగా ఉంటోందని తెలుసుకున్న సూర్య అక్కడికి వెళ్లి ఆమెను లైంగిక వేధింపులకు గురి చేశాడు. తరువాత బాలికను లొంగదీసుకుని అత్యాచారం చెయ్యడం మొదలు పెట్టాడు.

ఫ్రెండ్ లవర్ పై గ్యాంగ్ రేప్

ఫ్రెండ్ లవర్ పై గ్యాంగ్ రేప్

బాలిక మీద అత్యాచారం చేస్తున్న సూర్య తరువాత అతని స్నేహితులకు బాలిక తో తనకు ఉన్న సంబంధం గురించి చెప్పాడు. మీరు తన ప్రియురాలి మీద అత్యాచారం చేస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని సూర్య మద్యం మత్తులో స్నేహితులకు చెప్పాడు. ఇదే మంచి చాన్స్ అనుకున్న సూర్య స్నేహితులు రూబెన్, గోకుల్, వీరయ్యన్, కారల్ మార్క్స్ తదితరులు బాలిక మీద కన్ను వేశారు. తరువాత బాలిక ఇంటికి వెళ్లిన సూర్య, అతని స్నేహితులు ఆమెను బెదిరించి గ్యాంగ్ రేప్ చేశారు.

వీడియోలతో బ్లాక్ మెయిల్

వీడియోలతో బ్లాక్ మెయిల్

బాలిక మీద గ్యాంగ్ రేప్ చేస్తున్న సమయంలో మొబైల్ లో వీడియోలు తీసి మీ తల్లిదండ్రులకు చూపిస్తామని బెదిరించి ఒక నెల రోజులు ఆమెపై అత్యాచారం చేశారు. ఎక్కడ విషయం తల్లిదండ్రులకు తెలుస్తుందో అనే భయంతో బాలిక విషయం బయటకు చెప్పలేదు. బాలిక భయాన్ని గుర్తించిన సూర్య నిత్యం స్నేహితులతో కలిసి వెళ్లి బాలిక మీద పదేపదే అత్యాచారం చేశారు.

హాస్టల్ లో కుప్పకూలిన బాలిక

హాస్టల్ లో కుప్పకూలిన బాలిక

రెండు రోజుల క్రితం బాలిక పుదుచ్చేరిలోని హాస్టల్ కు వెళ్లింది. తరువాత కడుపునోప్పి ఎక్కువ రావడంతో బాలిక కుప్పకూలిపోయింది. వెంటనే టీచర్లు, హాస్టల్ సిబ్బంది బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలికకు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు ఆమె గర్బవతి అని చెప్పడంతో హాస్టల్ సిబ్బంది షాక్ కు గురై ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

Recommended Video

    17 మందితో షాపింగ్ మాల్ లో సెక్స్ రాకెట్
    లవర్ కాదు సైకో

    లవర్ కాదు సైకో

    బాలిక కుటుంబ సభ్యులు నాగపట్టణం జిల్లా ఎస్పీ సెల్వ నాగరత్నంకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలికను ప్రశ్నించగా తన లవర్ సూర్య, అతని స్నేహితులు పదేపదే అత్యాచారం చేశారని చెప్పింది. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు సూర్య, గోకుల్, రూబన్, వీరయ్యన్, కారల్ మార్క్స్ ను అరెస్టు చేశారు. బాలిక మీద సామూహిక అత్యాచారం చేసిన కేసులో మరో ఇద్దరు తప్పించుకున్నారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+