బెంగాల్‌ను ఊడ్చేసిన దీదీ-బీజేపీతో పోరులో సిససైన గెలుపు- క్లీన్‌స్వీప్‌కు కారణాలివే
పశ్చిమబెంగాల్లో దీదీ మరోసారి పట్టు నిరూపించుకుంది. ఒకప్పుడు కాంగ్రెస్ నుంచి వేరుపడి, కమ్యూనిస్టులను కుమ్మేసి బెంగాల్లో పాగా వేసిన మమతా బెనర్జీ.. వరుసగా మూడోసారి గెలుపుతో హ్యాట్రిక్ సాధించింది. అంతే కాదు ఏకంగా 292 సీట్లున్న అసెంబ్లీ 200కి పైగా సీట్లు సాధించిన మమత.. బెంగాల్లో తానేంటో ప్రత్యర్ధులకు మరోసారి తేల్చిచెప్పారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీని 80 సీట్లలోపే పరిమితం చేసిన ఈ గెలుపు వెనుక ఐదు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి.

బెంగాల్లో మమత క్లీన్‌స్వీప్
సరిగ్గా నెల రోజుల క్రితం పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ గెలుస్తుందా అని అడిగితే అవునని కచ్చితంగా చెప్పలేని పరిస్దితి. ఏడాది కాలంగా బీజేపీ అక్కడ చేసిన హంగామా, కేంద్ర పెద్దలు మమతా బెనర్జీతో సాగించిన పోరును చూసిన వారెవరూ మమత హ్యాట్రిక్ సాధిస్తుందని చెప్పేందుకు సాహసించలేకపోయారు. అలాంటి పరిస్ధితి నుంచి బెంగాల్‌ను ఒంటిచేత్తో క్లీన్‌స్వీప్ చేసేసిన ఇవాళ్టి పరిస్దితి చూస్తుంటే బెంగాలీల్లో మమతా బెనర్జీ ఎంతగా పాతుకుపోయారో అర్ధమవుతుంది. గతంలో సాధించిన విజయాలన్నీ ఓ ఎత్తయితే బీజేపీతో ముఖాముఖీ సాగిన పోరులో మమత సాధించిన ఈ విజయం తృణమూల్‌కు ఎంతో ప్రత్యేకమైంది. ఈ చారిత్రక విజయం వెనుక కొన్ని ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి.

బీజేపీకి సీఎం అభ్యర్ధి లేకపోవడం
బెంగాల్లో మమత వంటి ప్రజాకర్షక నేతను, సిట్టింగ్ సీఎంను ముఖాముఖీ ఎదుర్కొనేందుకు సిద్దమైన బీజేపీ అందుకు తగ్గ అస్త్రాలను సిద్ధం చేసుకోవడంలో మాత్రం విఫలమైంది. ముఖ్యంగా సిట్టింగ్ సీఎం మమతకు ప్రత్యామ్నాయంగా సీఎం అభ్యర్ధిని ఎంచుకోవడంలో కాషాయ నేతలు విఫలమయ్యారు. ప్రచారంలో సైతం ప్రధాని మోడీ, అమిత్‌షాలే కనిపించారు. దీంతో మమతకు ప్రత్యామ్నాయంగా కానీ, ఆమెకు సరితూగే నేత కానీ ఓటర్లకు కనిపించలేదు. దీంతో సహజంగానే ఓటర్లకు మమత తప్పనిసరిగా మారిపోయారు.

ఫలించిన ఔట్‌సైడర్స్ ప్రయోగం
పశ్చిమబెంగాల్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా మమతా బెనర్జీ.. మోడీ, అమిత్‌షాను ఔట్ సైడర్స్‌గా అభివర్ణించారు. బెంగాల్ పుత్రిక కావాలా బయటివారో కావాలో తేల్చుకోవాలని ఓటర్లకు సవాల్ విసిరారు. దీంతో సహజంగానే స్ధానికురాలైన సిట్టింగ్ సీఎం మమతవైపు ఓటర్ల మొగ్గు కనిపించింది. మమతే కాదు మేం కూడా బెంగాల్ పుత్రికలమే అంటూ బీజేపీ మహిళా నేతలు చేసిన ప్రచారాన్ని జనం నమ్మలేదు. దీంతో స్ధానికత ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీకి భారీగా కలిసొచ్చినట్లు తెలుస్తోంది.

మమత మహిళా పథకాలు
బెంగాల్లో మహిళల కోసం మమతా బెనర్జీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఓటర్లకు ఎంతో ప్రయోజనకరంగా కనిపించాయి. సాటి మహిళగా దీదీ తమ కష్టాలు అర్ధం చేసుకుందన్న భావన వారిలో కలిగించాయి. దీంతో మహిళా ఓటర్లలో పెద్ద ఎత్తున తృణమూల్‌కు ఆదరణ లభించింది. ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికలకు కన్యాశ్రీ పథకం కింద ఇస్తున్న రూ.25 వేలు, 18 ఏళ్ల యువతి కుటుంబానికి రూపాశ్రీ పథకం కింద రూ.25వేలు ఇవ్వడం మహిళా ఓటర్లలో మమతపై నమ్మకాన్ని పెంచాయి. ఇక ఉచిత బియ్యం, ఉచిత రేషన్ వంటి పథకాలు కూడా మమతకు భారీగా మేలు చేశాయి.
Recommended Video

మమతవైపు చేరిన కాంగ్రెస్-లెఫ్ట్ ఓటు బ్యాంక్
2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్-లెఫ్ట్ పార్టీల రూపంలో ఓటు బ్యాంకు చీలిపోవడంతో అది బీజేపీకి మేలు చేసి ఏకంగా 18 ఎంపీ సీట్లు గెల్చుకుంది. కానీ ఈసారి ఆ ఓటు బ్యాంకు మమతవైపు మళ్లినట్లు తాజా ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో ఈసారి తృణమూల్ ఓటు శాతం 43 నుంచి 49కి పెరగగా.. బీజేపీ ఓటు బ్యాంకు 40 నుంచి 37కు తగ్గిపోయింది. సీఏఏకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ సాగించిన ప్రచారంలో రాష్ట్రంలో ముస్లింలు కాంగ్రెస్-లెఫ్ట్ పార్టీల్ని కాదని తృణమూల్ వైపు చేరిపోయారు. అదే సమయంలో బీజేపీ ఓట్ల పోలరైజేషన్ కోసం చేసిన ప్రయత్నాలతో ముస్లింలు ఏకపక్షంగా మమతవైపు మొగ్గారు. దీంతో ఇది కూడా దీదీకి కలిసొచ్చింది.












Click it and Unblock the Notifications