Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉగ్ర ఘాతుకమే: ఆర్మీ వాహనంపై గ్రెనెడ్లతో దాడి, ఐదుగురు సైనికులు సజీవ దహనం

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పూంచ్-జమ్మూ హైవేపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఆర్మీ వాహనం మంటల్లో చిక్కుకోవడంతో ఐదుగురు జవాన్లు సజీవదహనమయ్యారు. ఆర్మీ వాహనం పూంచ్ జిల్లాలోని భింబర్ గలి నుంచి సాంగ్యోట్‌కు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

ఈ ప్రాంతంలో భారీ వర్షాలు, తక్కువ దృశ్యమానతను ఉపయోగించుకున్న గుర్తుతెలియని ఉగ్రవాదులు వాహనంపై కాల్పులు జరిపారని నార్తర్న్ కమాండ్ తెలిపింది. ఉగ్రవాదులు గ్రెనేడ్‌లు ప్రయోగించడం వల్ల వాహనం మంటల్లో చిక్కుకుందని వెల్లడించారు.

Five Soldiers

'కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్ల కోసం మోహరించిన రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్‌కు చెందిన ఐదుగురు సిబ్బంది దురదృష్టవశాత్తు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో సైనికుడిని వెంటనే రాజౌరీలోని ఆర్మీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు' అని నార్తర్న్ కమాండ్ పేర్కొంది. నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

కాలిపోతున్న ట్రక్కు పక్కన రోడ్డుపై పడి ఉన్న సైనికుల మృతదేహాలకు సంబంధిచిన వీడియోలు వైరల్ అయ్యాయి. స్థానికులు, ఆర్మీ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. మొదట ఈ దారుణమైన దాడి పిడుగుపాటు అనుకున్నప్పటికీ.. విచారణలో ఉగ్రదాడిగా అధికారులు తేల్చారు. ఈ దాడికి పాల్పడింది తామేనని జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.

కాగా, గత ఏడాది డిసెంబరులో రాజస్థాన్‌లోని ఉదయపూర్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇండియన్ ఆర్మీ ట్రక్కులో సాంకేతిక లోపం కారణంగా మంటలు చెలరేగాయి. ఉదయపూర్‌లోని మిలటరీ స్టేషన్‌కు వెళుతున్న ఐదు వాహనాల కాన్వాయ్‌లో ట్రక్కు భాగంగా ఉంది. అయితే, సిబ్బంది, ప్రాణ నష్టం జరగలేదు.

2021లో రాజస్థాన్‌లోని గంగానగర్ జిల్లాలో వారు ప్రయాణిస్తున్న ఆర్మీ వాహనం బోల్తా పడి మంటలు చెలరేగడంతో ముగ్గురు సైనికులు మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు. గత వారం, భటిండాలోని మిలిటరీ స్టేషన్‌లో జరిగిన కాల్పుల్లో నలుగురు సైనికులు నిద్రలోనే మరణించారు. సిబ్బంది తమ గదుల్లో నిద్రిస్తుండగా, తెల్లటి కుర్తా పైజామాలో ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు రైఫిళ్లు, పదునైన ఆయుధాలతో వారిపై దాడి చేశారు.

నలుగురు జవాన్లు వారి గదుల్లో రక్తపు మడుగులో పడి ఉన్నారు. ఘటనా స్థలం నుంచి INSAS రైఫిల్‌కు చెందిన 19 ఖాళీ షెల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి దేశాయ్ మోహన్ అనే ఆర్మీ జవాన్‌ను అరెస్టు చేశారు. భటిండా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గుల్నీత్ సింగ్ ఖురానా ఉద్దేశ్యం వ్యక్తిగతమని, మోహన్‌కి వారితో శత్రుత్వం ఉందని చెప్పారు.

ఒక రోజు తర్వాత, భటిండా మిలిటరీ స్టేషన్‌లో సర్వీస్ తపాకీ ప్రమాదవశాత్తూ పేలిపోవడంతో మరో జవాన్ మరణించాడు. అయితే, ఈ రెండు ఘటనల మధ్య ఎలాంటి సంబంధం లేదని భారత సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. రెండో ఘటన ఆత్మహత్యాయత్నంగా అనుమానిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+