ఎల్‌టీటీఈపై ఐదేళ్ల నిషేధం పొడిగింపు: ట్రిబ్యునల్ ఆమోదం
న్యూఢిల్లీ: లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలమ్(ఎల్‌టీటీఈ)పై కేంద్రం విధించిన ఐదేళ్ల నిషేధాన్ని కొనసాగించాలా? వద్ధా అనే అంశంపై ఏర్పాటైన ట్రిబ్యూనల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాద సంస్థగా పేర్కొంటున్న ఎల్‌టీటీఈపై నిషేధాన్ని కొనసాగించాలని ఢిల్లీ హైకోర్టు జడ్జీ నేతృత్వంలోని ట్రిబ్యూనల్ స్పష్టం చేసింది.
దాదాపు వారం క్రితమే లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలమ్(ఎల్‌టీటీఈ)పై విధించిన నిషేధానికి ఆమోద ముద్ర లభించింంది. ఇందుకు సంబంధించిన నివేదికను సీల్డ్ కవర్‌లో ప్రభుత్వానికి అప్పగించింది జస్టిస్ సంగీత ధింగ్రా సెహ్గల్ నేతృత్వంలోని ట్రిబ్యునల్. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులోని వర్గాల ద్వారా తెలిసిందని ఓ జాతీయ మీడియా తన కథనంలో వెల్లడించింది.

మరుమలర్చి ద్రావిడ మున్నేట్రా కళగమ్(ఎండీఎంకే) నేత, రాజ్యసభ ఎంపీ వైగో సహా మధ్యవర్తుల అభిప్రాయం తీసుకున్న తర్వాత ట్రిబ్యునల్ ఈ మేరకు ప్రభుత్వ నిర్ణయానికి ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది.
కాగా, లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలమ్(ఎల్‌టీటీఈ)పై మరో ఐదేళ్లపాటు నిషేధం కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం 1967 కింద ఈ నిషేధాన్ని పొడిగించినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గత మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఎల్‌టీటీఈ ఇంకా భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని, దీంతో ప్రజల భద్రతకు తీవ్ర ముప్పు పొంచివుందని గెజిట్‌లో పేర్కొంది. దీంతో దీన్ని ఇంకా చట్ట వ్యతిరేక సంస్థగా కొనసాగించాల్సిన అవసరం ఉందని వివరించింది.
1991లో రాజీవ్ గాంధీ హత్యానంతరం ఎల్‌టీటీఈపై భారత్ నిషేధం విధించిన విషయం తెలిసిందే. చివరిసారిగా 2014లో ఈ సంస్థపై నిషేధాన్ని పొడిగించింది.
చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం 1967 కింద ఈ నిషేధాన్ని పొడిగించినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది. 1991లో రాజీవ్ గాంధీ హత్యానంతరం ఎల్‌టీటీఈపై భారత్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications